ఆ ఛానల్‌పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ దాడి..మెగా వార్నింగ్
గత కొద్దికాలంగా మెగా వర్సెస్ అల్లు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. అప్పటి నుంచి మెగా ,అల్లు కుటుంబాల మధ్య మాటల్లేవనే చర్చ సాగుతోంది. పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికి, లోలోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తున్నాయి.
అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా వీడియోలు చేసిన ఛానెల్‌పై అల్లు అర్జున్ అభిమానులు దాడికి దిగారు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఉద్దేశపూర్వకంగా అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా కొన్ని థంబ్నెయిల్స్‌తో వీడియోలు విడుదల చేశారు. ఈ వీడియోలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బన్నీ ఫ్యాన్స్.. సదరు ఛానెల్‌పై దాడి చేశారు. తమ హీరోను కించపరిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

ఇక సినీ యావత్తు మొత్తం కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2 సినిమా కోసం అతృతుగా ఎదురు చూస్తోంది. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప మొదటి పార్ట్ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు నార్త్ ఆడియోన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాకు గానూ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ హీరో అవార్డు సైతం గెలుచుకున్నారు.జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ నిలిచారు.
బన్నీ తన మ్యానరిజంతో, యాక్టింగ్‌తో పుష్పను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టేశాడు. నార్త్ ఆడియెన్స్‌కు పుష్ప బాగా ఎక్కేసింది. అందుకే పుష్ప అక్కడ వంద కోట్లు కొల్లగొట్టేసింది. దీంతో 'పుష్ప-2'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం నార్త్ ఆడియెన్స్ ఎంతో అతృతుగా ఎదురు చూస్తున్నారు. సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఐటం సాంగ్‌లో నటిస్తోంది. దీనికి సంబంధించిన అఫిషియల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేశారు.












Click it and Unblock the Notifications