మెగా కుటుంబంతో బంధాన్ని పూర్తిగా తెంచేసుకున్న అల్లు అర్జున్?
ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు హోరెత్తిపోయాయి. రాజకీయ రంగంలో ఉన్నవారి నుంచి సినీ రంగంలో ఉన్నవారివరకు, వివిధ రంగాల్లోని సెలబ్రిటీలంతా పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు సామాజిక మాధ్యమాలద్వారా తెలిపారు. సోషల్ మీడియా మొత్తం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలతోపాటు, ఆయన ఫొటోలతో హోరెత్తింది. అందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినప్పటికీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన విషెస్ పైనే అందరి దృష్టి పడింది.
అల్లు అరవింద్ కూడా పిఠాపురం వెళ్లారు
ఎందుకంటే కొంతకాలం నుంచి మెగా కుటుంబానికి, అల్లు అర్జున్ కు సఖ్యత లేదు. పిఠాపురం నుంచి పవన్ ఎమ్మెల్యేగా పోటీచేసే సమయంలో కూడా గెలవాలని కోరుకుంటున్నానంటూ బన్నీ సింపుల్ గా ట్వీట్ పెట్టారు. గెలుపొందిన తర్వాత కూడా అంతే సింపుల్ గా ట్వీట్ చేశారు. అంతకుమించి ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పవన్ కల్యాణ్ తరఫున ప్రచారానికి మెగా కుటుంబ సభ్యులంతా వెళ్లారు. చివరకు అల్లు అరవింద్ కూడా పిఠాపురం వెళ్లి ప్రచారం చేశారు. అల్లు అర్జున్ మాత్రం నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారు.

పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్
అప్పటి నుంచి పవన్ కల్యాణ్ అభిమానులతో అల్లు అర్జున్ కు దూరం మరింతగా పెరిగింది. కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీనికి తగ్గట్లుగానే మారుతీనగర్ సుబ్రమణ్యం వేడుకలో పాల్గొన్న అల్లు అర్జున్ తనకు ఇష్టమున్న చోటకే తాను వెళ్తానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు మెగా కుటుంబం, అల్లు కుటుంబం మధ్య నిప్పు రాజేశాయి. సినిమాల్లో హీరోలు ఎర్రచందనం స్మగ్లర్లుగా నటిస్తున్నారంటూ పవన్ అటవీశాఖ మంత్రి హోదాలో వ్యాఖ్యానించారు. దీనికి కౌంటరే మారుతీనగర్ సుబ్రమణ్యం వేడుకలో అల్లు అర్జున్ ఇచ్చారు. అందుకే పుట్టినరోజు నాడు కూడా 'హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు' అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. సాధారణంగా పవన్ కల్యాణ్ చిన మామయ్య అవుతాడు. సంబంధాలన్నీ బాగున్న రోజుల్లో ఏనాడూ పవన్ కల్యాణ్ గారు అని అల్లు అర్జున్ పిలవలేదు. ఇప్పుడు దూరం పెరిగింది కాబట్టి ఆ దూరానికి తగినట్లుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు అంటూ ఎవరో పరాయి వ్యక్తి చెప్పినట్లు చెప్పారు. దాదాపుగా మెగా కుటుంబంతో బన్నీ బంధాన్ని పూర్తిగా వదిలేసుకున్నట్లేనని తెలుగు ఫిలింనగర్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.












Click it and Unblock the Notifications