జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక అల్లు అర్జున్..నిజాలు బయటపెట్టిన లేడీ కొరియోగ్రాఫర్
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. తన దగ్గర పని చేస్తోన్న అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్ శ్రేష్టి వర్మపై జానీ అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి శ్రేష్టి వర్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు జానీ మాస్టర్‌పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ చెప్పిన వివరాల ప్రకారం... 2017లో 'ఢీ' షోలో జానీ మాస్టర్ తనకు పరిచియమైనట్లు తెలిపింది. ఆ తర్వాత జానీ మాస్టర్ టీం నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండాలంటూ తనకు ఫోన్ కాల్ రావడంతో 2019లో జానీ మాస్టర్ టీంలో జాయిన్ అయినట్లు శ్రేష్టి వర్మ పేర్కొంది.
ఓ షో కోసం జానీ మాస్టర్తో పాటు మరో ఇద్దరితో కలిసి తాను ముంబైకి వెళ్లానని, ఆ సమయంలో ముంబైలోని హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ తన ఎఫ్ఐఆర్ కాపీలో చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని బయటికి ఎవరికీ చెప్పవద్దని జానీ మాస్టర్ బెదిరించినట్లు వాపోయింది. అదే విధంగా షూటింగ్ సమయంలో అతను చెప్పినట్లుగా వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై పలుమార్లు జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని ఎఫ్ఐఆర్‌లో శ్రేష్టి వర్మ ఫిర్యాదు చేసింది.

యువతి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్పై అత్యాచారం కేసు నమోదు చేశారు. 376,506,323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో జానీ మాస్టర్ కొన్నాళ్లు జైలు జీవితం కూడా గడిపారు. ప్రస్తుతం ఆయన బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. తాజాగా జానీ మాస్టర్ చేసిన ఆరాచకాలపై కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ కీలక విషయాలను వెల్లడించింది. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలు ఆమె పలు అంశాలను ప్రస్తావించారు. జానీ మాస్టర్ నన్ను లైంగికంగా వేధించారు నాకు 16 ఏళ్ల వయసు నుంచే ఆయన లైంగిక దాడి చేశారు.
నన్ను చాలా టార్చర్ చేశాడు.. అందుకే కేసు పెట్టాను..
— RTV (@RTVnewsnetwork) January 27, 2025
జానీ మాస్టర్ పై లేడీ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ సంచలన కామెంట్స్ #JaniMaster #ShrastiVarma #RTV pic.twitter.com/IKJM7rnb2L
ఆ సమయంలో నేను చాలా చిన్న పిల్లని భయపడ్డాను అందుకే చెప్పలేకపోయాను. నాలుగేళ్లు ఆయన మారతారని వెయిట్ చేశాను ఇక ఆయన మారారని తెలుసుకొని ఆయనపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను తప్ప వేరే ఉద్దేశం లేదు అని శ్రేష్ట వర్మ ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక అల్లు అర్జున్ ఉన్నారనే అంశంపై కూడా శ్రేష్టి వర్మ స్పందించారు. ఈ కేసులో ఎలాంటి కుట్రలేదని, అల్లు అర్జున్‌కు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జానీ మాస్టర్‌పై తాను కక్షతో కేసు వేయలేదని, తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినందుకే ధైర్యంగా ముందుకు వచ్చానని తెలిపారు.దీంతో జానీ మాస్టర్ అరెస్ట్‌లో అల్లు అర్జున్ పాత్ర లేదని స్పష్టం అయింది.
-
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications