మహేష్‌బాబుకు భారీ షాక్.. అల్లు అర్జున్‌వైపు మల్టీనేషనల్ కంపెనీ

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ రూ.1500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. పాన్ వరల్డ్ మూవీగా రాబోతున్న ఈ సినిమా రెండు భాగాలుగా వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ సినిమాకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉండటంతో మొత్తంమీద మూడు సంవత్సరాలు అభిమానులకు మహేష్ బాబు దూరమైనట్లే.

ఒప్పందం కుదిరింది
ప్రస్తుతం వాణిజ్య ప్రకటనలు చేస్తున్నారు. కొన్నాళ్ల నుంచి థమ్సప్ యాడ్ కూడా మహేష్ బాబు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ యాడ్ కు మహేష్ బాబు గుడ్ బై చెప్పేశారు. దీంతో కొత్త ప్రచారకర్తను వెతికేపనిలో కంపెనీ ఉంది. ఈ యాడ్ ను అల్లు అర్జున్ తో చేయించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కంపెనీ ప్రతినిధుల మధ్య, అల్లు అర్జున్ మధ్య ఒప్పందం కుదిరిందని సమాచారం. క్రిష్ ఈ యాడ్ కు దర్శకత్వం వహిస్తారు. మెగా కుటుంబంతో, పవన్ కల్యాణ్ అభిమానులతో విభేదాలు ఏర్పడటంతో అల్లు అర్జున్ పేరు నిత్యం ట్రెండింగ్ లో ఉంటోంది. దీన్ని క్యాష్ చేసుకుంటే బాగుటుందనే ఆలోచనతో థమ్సప్ కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది.

Allu Arjun has signed a contract with the company Thumpsup

వాణిజ్య ప్రకటనలు చేస్తున్న అల్లు అర్జున్
అల్లు అర్జున్ ప్రస్తుతం పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నారు. రామోజీ ఫిలింసిటీలో పుష్ప2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ షూటింగ్ విరామం మధ్యలో థమ్సప్ యాడ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. మహేష్ బాబు చేసిన థమ్సప్ యాడ్ కు రెస్పాన్స్ భారీస్థాయిలో వచ్చేది. మరి అల్లు అర్జున్ కూడా మహేష్ బాబు స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకుంటారేమో చూడాలి. డిసెంబరు ఆరోతేదీన పుష్ప2 విడుదల కాబోతోంది. అనేక వివాదాల మధ్యే తిరిగి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. సుకుమార్ దర్శకుడు కాగా, రష్మిక కథానాయికగా నటిస్తోంది. మొదటి భాగం హిట్ కావడంతో రెండో భాగంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+