మలుపు తిరిగిన కేసు... హైకోర్టులో అల్లు అర్జున్‌కు కష్టాలే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప2 చిత్రం ఈనెల 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అంతకుముందు రోజు నాలుగోతేదీన రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో బెనిఫిట్ షో వేశారు. అదే థియేటర్ లో అభిమానుల మధ్య సినిమా చూడటానికి అల్లు అర్జున్ రావడంతో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటతో దిల్ షుక్ నగర్ కు చెందిన రేవతి అనే 35 సంవత్సరాల వయసున్న మహిళ మరణించారు. ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు సాయితేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆ బాబు పరిస్థితిపై వైద్యులు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు. మరో నాలుగు రోజులు గడిస్తేకానీ స్పష్టత రాదు.

ప్రభుత్వమే బెనిఫిట్ షోలకు అనుమతిచ్చింది
తమకు ముందుగానే చెప్పకుండా అల్లు అర్జున్ అక్కడకు వచ్చాడంటూ అతనిపై, పుష్ప2 టీంపై, సంధ్య థియేటర్ యాజమాన్యంపై చిక్కడపల్లి పోలీసులు భారత న్యాయ సంహిత చట్టాల ప్రకారం 105, 118(1) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై సంధ్య థియేటర్ యజమాని రేణుకాదేవి ముందుగా హైకోర్టును ఆశ్రయించారు. తాము థియేటర్ ను డిస్ట్రిబ్యూటర్లకు అప్పగించామని, వారే ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు వేసుకున్నారని, ప్రభుత్వమే వాటికి అనుమతిచ్చిందని, తమవంతుగా కేవలం సెక్యూరిటీని మాత్రమే కల్పించామని పేర్కొన్నారు. కానీ తమపై కేసులు నమోదు చేయడం న్యాయం కాదని ఆ పిటిషన్ లో రేణుకాదేవి పేర్కొన్నారు.

Allu Arjun is likely to face difficulties in Telangana High Court

హైకోర్టులో బన్నీ క్వాష్ పిటిషన్
సరిగ్గా ఇదే కేసు విషయమై అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. చిక్కడపల్లి పోలీసులు తనపై పెట్టిన కేసులను కొట్టేయాలంటూ అందులో పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ కేసులో థియేటర్ యాజమాని, థియేటర్ మేనేజర్, సెక్యూరిటీ ఆఫీసర్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అయితే అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదని, బీఎన్ఎస్ చట్టాల ప్రకారం అతన్ని కూడా పోలీసులు విచారించడానికి అనుమతిచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇటీవలే ఏపీ హైకోర్టులో కూడా నంద్యాల పోలీసులు దాఖలు చేసిన కేసును కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ వేయగా కోర్టు ఆ కేసును కొట్టేసి బన్నీకి ఊరటనిచ్చింది. అయితే ఆ కేసు వేరు కావడం, ఈ కేసు వేరు కావడంతోపాటు ఓ మహిళ మృతిచెందడం, ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంలాంటివన్నీ అల్లు అర్జున్ ను తీవ్ర ఇక్కట్లకు గురిచేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+