మంచు లక్ష్మీ కోసం రంగంలోకి దిగిన అల్లు అర్జున్
మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ మరియు మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిర్మించిన చిత్రం 'దక్ష - ది డెడ్‌లీ కాన్స్పిరసీ' (Daksha - The Deadly Conspiracy). ఇందులో డాక్టర్ మంచు మోహన్ బాబు కీలక పాత్రలో నటించడం విశేషం. తండ్రీ కూతుళ్లు కలిసి తెరపై కనిపించడం ఇదే మొదటిసారి కావడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఈ చిత్రానికి వంశీ కృష్ణ మల్లా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అందించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, U/A సర్టిఫికెట్‌ను పొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా, ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మంచు లక్ష్మికి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మోహన్ బాబు, మంచు లక్ష్మి కలిసి నటించడం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.

దర్శకుడు వంశీ కృష్ణ మల్లా మాట్లాడుతూ, అల్లు అర్జున్ ట్రైలర్‌ను మెచ్చుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అలాగే, దుబాయ్‌లో జరిగిన 'సైమా-2025' వేడుకల్లోనూ ట్రైలర్‌కు మంచి స్పందన లభించిందని తెలిపారు. ఈ సినిమాపై తమకు ఎంతో నమ్మకం ఉందని, మంచు లక్ష్మి ఒక అద్భుతమైన పాత్రలో కనిపిస్తారని ఆయన అన్నారు. మోహన్ బాబు, సముద్రఖని, మలయాళ నటుడు సిద్దిక్ వంటి నటులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. సంగీతం అచ్చు రాజమణి, ఛాయాగ్రహణం గోకుల్ భారతి అందించారు. ఈ సినిమాను ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఆదరించాలని దర్శకుడు కోరారు.












Click it and Unblock the Notifications