భార్యతో కలిసి ఢిల్లీ బయలుదేరిన అల్లు అర్జున్... ఎందుకో తెలుసా..
పుష్ప సినిమాతో జాతీయ అవార్డును తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్యతో కలిసి ఢిల్లీకి బయలు దేరారు. ఈ సందర్భంగా వీరిద్దరూ ఎయిర్ పోర్ట్ లో సందడి చేశారు. ఆ ఫోటోలు కాస్త ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేపు ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరగనుంది. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు, అల్లుఅర్జున్ తన సతీమణితో కలిసి ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం..
హాట్ లుక్‌లో అల్లు స్నేహరెడ్డి..
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాకు గాను అల్లుఅర్జున్ బెస్ట్ యాక్టర్‌గా ఎంపికయ్యారు. గత నెలలో ఈ జాతీయ అవార్డులను ప్రకటించిన సంగతి విదితమే. అల్లుఅర్జున్ చరిత్ర సృష్టించారు. ఎందుకంటే, తొలిసారిగా ఒక తెలుగు నటుడు జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం ఇదే మొదటిసారి. ఈ జాతీయ అవార్ఢుల ప్రదానోత్సవం కార్యక్రమం రేపు ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో జరగనుంది.

అందులో పాల్గొనేందుకు, జాతీయ అవార్డు అందుకునేందుకు బన్నీ ఢిల్లీ వెళ్లారు. ఆయనతో పాటు భార్య అల్లు స్నేహరెడ్డి కూడా వెళ్లారు. ఎయిర్‌పోర్ట్ లో ఉన్న వీరి ఫోటోలు ఇప్పడు కాస్తా వైరల్‌గా మారాయి. అయితే ఈ ఫోటోల్లో అల్లు స్నేహారెడ్డి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. ఆమె వైట్ టాప్, బ్లూ జీన్స్ ధరించారు. హాట్‌లుక్‌లో స్నేహరెడ్డి అదరగొడుతున్నారు. కూలింగ్ గ్లాసెస్ ధరించి ఎంతో స్టయిలీష్‌గా కనిపిస్తూ అల్లుఅర్జున్‌నే డామినేట్ చేస్తున్నారు.
అక్టోబర్ 17న జాతీయ అవార్డు ప్రధానోత్సవం...
అల్లుఅర్జున్ బ్లాక్ టీషర్ట్, కాజ్వల్ బ్లాక్ ప్యాంట్ ధరించారు. స్టయిలీష్ గ్లాసెస్ పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరి పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పుష్ప టీమ్ కూడా ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సుకుమార్, మైత్రీ నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ కూడా అక్టోబర్ 17 వ తేదిన జాతీయ అవార్డు ప్రధానోత్సవ వేడుకలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. మ్యూజిక్ విభాగంలో దేవిశ్రీ ప్రసాద్ కూడా జాతీయ అవార్డు వరించిన సంగతి తెలిసిందే.
అయితే జాతీయ అవార్డుల్లో ఈ సారి తెలుగుకి అత్యధికంగా పది అవార్డులు దక్కడం విశేషం. ఇందులో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకి ఆరు అవార్డులు దక్కాయి. పుష్పసినిమాకి కి రెండు అవార్డులు వరించాయి. కొండపొలంసినిమాకి ఒకటి, ఉప్పెనసినిమాకి ఒక అవార్డు దక్కింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది. ఆ కార్యక్రమం అనంతరం మళ్లీ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications