అల్లు అర్జున్ 'రాకా' మూవీలో బిగ్ సర్‌ప్రైజ్!

Raaka Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కలయికలో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'రాకా'. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటైన ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ఓ సరికొత్త కాస్టింగ్ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ యాక్షన్ డ్రామాలో అల్లు అర్జున్ ఏకంగా మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని వార్తలు ఊపందుకున్నాయి.

ఈ సినిమాలో అల్లు అర్జున్ ఓ తండ్రి, ఆయన ఇద్దరు కొడుకుల పాత్రలలో నటించే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం. అంటే ఒకే కుటుంబానికి చెందిన మూడు వేర్వేరు పాత్రలను అల్లు అర్జున్ తెరపై పండించబోతున్నారు. ఈ వార్త బయటకు రావడంతో సినిమా కథాంశంపై అభిమానుల్లో రకరకాల అంచనాలు మొదలయ్యాయి. ఈ స్టోరీ వేర్వేరు తరాల మధ్య సాగుతుందా లేదా వేర్వేరు కాలాల్లో ఉంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో సైన్స్ ఫిక్షన్ లేదా టైమ్ ట్రావెల్, విభిన్న ప్రపంచాల కాన్సెప్ట్ కూడా ఉండవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

Allu Arjun might play a triple role in Atlee upcoming sci-fi action entertainer Raaka Movie Full Details

అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాత్రలపై ప్రచారంలో ఉన్న వార్తల్లో కొన్ని వైవిధ్యమైన కథనాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అల్లు అర్జున్ తండ్రిగా, ఒక పోలీస్ అధికారిగా, రాక్షసత్వంతో కూడిన ఒక వైల్డ్ పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ప్రచారంలో ఉన్న విశేషాలపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ సస్పెన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచడానికి ఓ కారణం కావచ్చు. డైరెక్టర్ అట్లీ తన సినిమాల్లో ప్రధాన పాత్రల రివీల్స్ ను అత్యంత డ్రామాటిక్‌గా డిజైన్ చేయడంలో సిద్ధహస్తుడు. అందుకే అల్లు అర్జున్ క్యారెక్టర్లను రహస్యంగా ఉంచడం కూడా ప్రమోషనల్ స్ట్రాటెజీలో ఓ భాగమై ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఈ ట్రిపుల్ రోల్ ప్రచారం నిజమైతే.. 'రాకా' సినిమా అల్లు అర్జున్ సినీ కెరీర్లోనే ఓ ప్రత్యేకమైన, అత్యంత వైవిధ్యమైన చిత్రంగా నిలిచిపోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+