ఆ హీరోయిన్‌ను బాగా ఇష్టపడ్డ అల్లు అర్జున్?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్‌గా ఎందుకు పేరుతెచ్చుకున్నారంటే అందరూ ఆయన స్టైల్ నే అనుసరిస్తారు కాబట్టి. యువతో ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. రామోజీ ఫిలింసిటీలో దీనికి సంబంధించిన సెట్ లో షూటింగ్ జరుగుతోంది. డిసెంబరు ఆరోతేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. దీనితర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ లేదంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉంది.
సినిమాల్లో అవకాశాలిప్పించారు
సినిమా సినిమాకు తనను తాను మెరుగుపరుచుకుంటూ వస్తోన్న అల్లు అర్జున్ తన తోటి నటి కేథరిన్ ను బాగా ఇష్టపడ్డారు. అంతేకాదు.. ఆమెకు వరుసగా సినిమాల్లో అవకాశాలిప్పించారంటూ గతంలో వార్తలు కూడా వచ్చాయి. వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన చమ్మక్ చల్లో చిత్రం ద్వారా మళయాళ పరిశ్రమ నుంచి తెలుగు పరిశ్రమలోకి కేథరిన్ థెరిసా ప్రవేశించింది. ఇద్దరమ్మాయిలతో సినిమాలో బన్నీ పక్కన రెండో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత పైసా, నేనే రాజు నేనే మంత్రి, గౌతమ్ నంద, సరైనోడు, వదలడు, వరల్డ్ ఫేమస్ లవర్, బింబిసార సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

రూమర్ రావడంతో అవకాశాలివ్వలేదు
అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్ర చేసిన రుద్రమదేవి సినిమాలో ఆయనకు జోడీగా అన్నాంబిక పాత్రలో కేథరిన్ నటించింది. అల్లు అర్జున్ తనకు జోడీగా ఇలా మూడు సినిమాల్లో కేథరిన్ ను తీసుకోవడంతో తెలుగు సినీ పరిశ్రమలో అల్లు అర్జున్ కేథరిన్ పై మనసు పడ్డారంటూ జోరుగా వార్తలు షికారు చేశాయి. ఎప్పుడైతే బయట ఇలాంటి రూమర్ వ్యాపించిందో అప్పటినుంచి బన్నీ తన సినిమాల్లో కేథరిన్ కు అవకాశం ఇవ్వడం ఆపేశారు. తనను బాగా ఇష్టపడటంవల్లే బన్నీ ఆమెకు అవకాశాలిప్పించారంటూ సామాజిక మాధ్యమాల్లో పుకార్లు కూడా వచ్చాయి.












Click it and Unblock the Notifications