హీరోయిన్స్ విషయంలో అల్లు అర్జున్ కాన్సన్ ట్రేషన్
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పుష్ప సినిమాకు అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.
పుష్ప సినిమాకు జాతీయ అవార్డు రావడంతో అల్లు అర్జున్ పేరు కొద్దిరోజుల పాటు తెలుగు సినిమా పరిశ్రమలో మార్మోగింది. అంతేకాకుండా జాతీయ అవార్డు లభించిన తర్వాత అల్లు అర్జున్ ని ఫాలో అయ్యే వారి సంఖ్య మరింత పెరిగింది. తాజాగా అల్లు అర్జున్ కి సంబంధించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బన్నీ తన సినిమాల ద్వారా కొత్త కొత్త హీరోయిన్స్ ని పరిచయం చేస్తూనే ఉంటారు. ట్రాక్ రికార్డు లేకపోయినా అందం, టాలెంట్ ఉంటే బన్నీ కచ్చితంగా తన సినిమాల్లో అవకాశం కల్పిస్తారు. ఇప్పటికే ఆయన సినిమాలో చాలామంది హీరోయిన్స్ ని అలాగే ఎంపిక చేసుకుంటుంటారు. ఈ విషయంలో బన్నీ విజయవంతమయ్యారని చెప్పవచ్చు.
తన సినిమాల్లో హీరోయిన్ గా చేయాలంటే ఎక్స్ప్రెషన్స్ అవలీలగా పలికించేవారినే ఇష్టపడతాడట. అంతేకాదు హీరోయిన్స్ తో వర్క్ చేసేటప్పుడు ఆ కంఫర్ట్ జోన్ ఇవ్వగలగాలి అంటూ చెబుతారు. సిగ్గుతో, మొహమాటంతో, బిడియంతో మొక్కుబడిగా యాక్టింగ్ చేస్తే తెరపై నటన బాగా రాదనేది బన్నీ నమ్మకం. అందుకే హీరోయిన్స్ లో ఆ మైనస్ లు లేకుండా చూసుకుంటారట. అందుకే బన్నీ సినిమాలు చాలా వరకు సక్సెస్ అవుతాయని చెప్పాలి.












Click it and Unblock the Notifications