రూ.100 కోట్లతో అల్లు అర్జున్ కొత్త ఇల్లు..

ఐకాన్ స్టార్ "అల్లు అర్జున్" టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. హైదరాబాద్‌లోని అత్యంత ప్రీమియం ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో తన కొత్త డ్రీమ్ హౌస్‌ను నిర్మించుకుంటుండటం ప్రస్తుతం సినీ వర్గాల్లోనే కాకుండా అభిమానుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ డ్రీమ్ హౌస్ నిర్మాణానికి సుమారు రూ.80 కోట్ల వరకు వ్యయం అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా ఈ కొత్త ఇల్లు మెగాస్టార్ చిరంజీవి నివాసానికి సమీపంలో ఉండటం విశేషం. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

అల్లు అర్జున్ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా ఈ ఇంటి డిజైన్ స్టైలిష్‌గా, మినిమలిస్టిక్ టచ్‌తో ఉండనుందని సమాచారం. ప్రకృతి వెలుతురు ఎక్కువగా వచ్చేలా, గ్రీన్ స్పేస్‌లకు ప్రాధాన్యత ఇచ్చేలా ఆర్కిటెక్చర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ మేన్షన్ దాదాపు 4,000 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతోంది. ఆధునిక ఆర్కిటెక్చర్‌తో పాటు, అంతర్జాతీయ స్థాయి డిజైన్ ఎలిమెంట్స్‌తో ఈ ఇల్లు రూపుదిద్దుకుంటున్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే ఇంటీరియర్ డిజైన్, దిగుమతి చేసిన మెటీరియల్స్, స్మార్ట్ హోమ్ టెక్నాలజీ వంటి అంశాల కారణంగా ఖర్చు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.

allu-arjun-new-house-in-jubilee-hills-worth-of-100-crores-became-talk-of-the-town-in-tollywood

అత్యాధునిక సౌకర్యాలు..

ఈ మేన్షన్‌లో లగ్జరీ స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ థియేటర్, జిమ్, గార్డెన్ ఏరియా, హైఎండ్ సెక్యూరిటీ సిస్టమ్ వంటి అనేక ఆధునిక సౌకర్యాలు ఉండనున్నాయి. అలాగే కుటుంబ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన లివింగ్ స్పేస్‌ ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు వేగంగా సాగుతుండగా, ఈ ఏడాది చివర్లో గృహప్రవేశం జరిపేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. పనులు సమయానికి పూర్తయితే, త్వరలోనే అల్లు అర్జున్ కుటుంబం ఈ కొత్త ఇంటికి మారే అవకాశముంది.

మరోవైపు అల్లు అర్జున్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో చిత్రం 'రాకా'. దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా.. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ , రష్మిక మందాన కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పుష్పరాజ్ అంటూ ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు బన్నీ. సుకుమార్ దర్శకత్వంలో రెండు పార్టులుగా వచ్చిన ఆ మూవీ.. పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ అందుకుంది. వరల్డ్ వైడ్ గా దాదాపు 1800 కోట్లు వసూలు చేయడంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.

ఈ క్రమంలోనే బన్నీ నటిస్తున్న ప్రాజెక్టులపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకున్నాయి. కాగా ఇటీవల ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే సందర్భంగా మూవీ టీమ్ ఫ్యాన్స్‌ కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. సినిమా టైటిల్ తో పాటు, అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసి మూవీపై బజ్ ను ఒక్కసారిగా పెంచేసింది. ఈ మూవీకి రాకా అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. ఫస్ట్ లుక్ పోస్టర్ లో గుండుతో, భారీ గోర్లు, బీస్ట్ స్టైల్ లుక్ తో అల్లు అర్జున్ అందరికీ షాక్ ఇచ్చాడు. అంతే కాకుండా 'ఇది కేవలం ప్రారంభం మాత్రమే, మీ ఊహలకు మించి సినిమా ఉంటుంది' అని చిత్రబృందం ఇచ్చిన క్యాప్షన్ మరింత హైప్‌ ను పెంచేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+