వీడియోతో క్లారిటీ ఇచ్చిన పుష్ప-2 మేకర్స్..!!
అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప-2 విడుదలపై అనేక వార్తలు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఆ సినిమా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. పుష్ప-2 సినిమా రిలీజ్ విడుదల వాయిదా పడుతోందంటూ నెట్టింట్లో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ సినిమా మేకర్స్ ఒక వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. పుష్ప-2 అసలు తగ్గేదేలే డిసెంబర్ 5 అంటూ ట్వీట్ (ఎక్స్) చేశారు..
సినిమాకు సంబంధించినట్రైలర్ పాట్నాలో విడుదలవగా దేశవ్యాప్తంగా దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో అభిమానులంతా సంబరంగా ఉన్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పోరాట దృశ్యాలను ఇంకా షూట్ చేస్తున్నారు. అంతేకాకుండా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ నుంచి దేవిశ్రీప్రసాద్ ను తప్పించి తమన్ కు అందించిన సంగతి తెలిసిందే.

నిర్మాతలు మాత్రం తగ్గేదేలే.. డిసెంబరు 5వ తేదీనే వస్తున్నాం అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను షేర్ చేశారు. ఇకపోతే ఇప్పటికే శ్రీలీలాకు సంబంధించిన ఐటెం సాంగ్ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సమంతాను మించి ఈ సాంగ్‌లో శ్రీలీలా పెర్ఫార్మ్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్‌తో సమానంగా స్టెప్పులు వేసిందని ఇండస్ట్రీ టాక్. 17 సెకన్లకే ఈ చిన్నదానికి ఇంత క్రేజ్ వచ్చిందంటే ఇక పూర్తి సాంగ్ విడుదలైతే ఈ అమ్మడు రేంజ్‌తో పాటు ఫ్యూచరే మారిపోతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఈ పూర్తి సాంగ్ విడుదల రేపే (ఆదివారం) విడుదల అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ హాట్ సాంగ్‌ను ఎంజాయ్ చేసేందుకు రేపటి వరకు వేచి చూడక తప్పదు.
DECEMBER 5th ~ #AssaluThaggedheLe 😎🔥🤙🏻 #RappaRappa 💥💥💥#Pushpa2TheRule pic.twitter.com/96IcsPoWfV
— Pushpa (@PushpaMovie) November 22, 2024
పుష్ప-2 సినిమాకు ఒక్క ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.1100 కోట్లు వరకు జరిగినట్టు ఇండస్ట్రీ టాక్. ఇక విడుదల అయితే అల్లు అర్జున్ ఎలాంటి రికార్డ్స్ బద్దలు కొడుతారో, కొత్త రికార్డ్స్ ఏవి క్రియేట్ చేస్తారో అనేదానిపై ఇప్పటి నుంచే బెట్టింగ్స్ జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications