అల్లు అర్జున్‌కు షాక్.. పుష్ప2కు వాళ్లు చేతులెత్తేశారు!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉండి, ఎప్పుడు వస్తుందా అని ఉత్కంఠతో ఎదురుచూసే సినిమాల్లో పుష్ప2 కూడా ఒకటి. పుష్ప1 అనూహ్యంగా తెలుగుకు మించి బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో పుష్ప2పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రెండోభాగంపై భారీ అంచనాలుండటతో నిర్మాత, దర్శకులు స్క్రిప్ట్ లో కొన్ని మార్పుచేర్పులు చేసి, బడ్జెట్ ను భారీగా పెంచి సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఆ బడ్జెట్ పుష్ప2కు శాపంలా మారింది.
కొన్నిచోట్ల బ్రేక్ ఈవెన్ అవలేదు
వాస్తవానికి ఈ సినిమాకు తెలుగులో అనుకున్నంత స్థాయిలో లాభాలేం రాలేదు. మూడు, నాలుగు ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ కూడా అవలేదు. హిందీలో మాత్రమే బాగా ఆడింది. రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. రెండో భాగం నిర్మించేందుకు నిర్మాతలు దాదాపుగా రూ.400 కోట్ల బడ్జెట్ కేటాయించారు. దీంతో సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను భారీగా చెబుతున్నారు. అయితే వారెవరూ పుష్ప2 కొనుగోలుకు ముందుకు రావడంలేదు. అడ్వాన్స్ ఇచ్చి సినిమాను తీసుకెళ్లి ఆడించి, హిట్ అయిన తర్వాత వచ్చే కలెక్షన్లను బట్టి లెక్కలు చూసుకుందామని నిర్మాతలకు స్పష్టం చేస్తున్నారు.

నాన్ రిఫండబుల్ ఇవ్వాలంటున్న నిర్మాతలు
అయితే నిర్మాతలు అందుకు ఒప్పుకోవడంలేదు. నాన్ రిఫండబుల్ అమౌంట్ (మళ్లీ తిరిగిచ్చే వీలు లేని డబ్బులు) మాత్రమే ఇవ్వాలంటున్నారు. దీంతో హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ తలలు పట్టుకు కూర్చున్నారు. బడ్జెట్ మీరు పెంచుకొని వాటిని థియేట్రికల్ హక్కులమీద రుద్దితే కష్టమని బయ్యర్లు నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు.
సినిమా ఎంత సూపర్ హిట్ అయినా అంత డబ్బులు రావని, ఏపీలోని థియేటర్లలో రేట్లు పెంచుకొని అమ్ముకోవడానికి ప్రభుత్వం అనుమతివ్వడంలేదని, అలాగే ప్రత్యేకంగా షోలు వేసుకుంటామన్నా ఇవ్వడంలేదని, ఇటువంటి పరిస్థితుల్లో అంత ధరలు పెట్టి సినిమాను కొనలేమని డిస్ట్రిబ్యూటర్లు తేల్చేస్తున్నారు. హీరో, దర్శకుడు, నిర్మాతలు ఏం చేస్తారో చూడాలి మరి.












Click it and Unblock the Notifications