భార్యపై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్..ఆమె నన్ను ఎప్పుడు ప్రేమించలేదంటూ ..

హీరో అల్లు అర్జున్‌కి ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా హీరోగా మారిపోయారు. సినిమాలతో పాటు, ఫ్యామిలీకి కూడా ప్రాధాన్యతను ఇస్తుంటారు. అల్లు అర్జున్ స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. స్నేహారెడ్డికి హీరోయిన్లతో సమానంగా క్రేజ్ ఉందంటే అతిశేయోక్తి కాదు. గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుందామె. స్నేహారెడ్డికి ఇన్ స్టాగ్రామ్‌లో ఏకంగా 9.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

హీరో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి సంబంధించిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే స్నేహారెడ్డి తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తన భర్త అల్లు అర్జున్ సినిమా విశేషాలతో పాటు, తన పిల్లల విషయాలను సోషల్ మీడియా వేదికగా స్నేహారెడ్డి షేర్ చేస్తుంటుంది. ఇక అల్లు స్నేహా ఫ్యాషన్‌కు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఆమె లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్‌ను ఫాలో అవుతుంటారని ఆమె డ్రెస్సింగ్ స్టైల్ చూస్తేనే అర్ధం అవుతుంది.

allu arjun shocking comments on his wife sneha reddy

తాజాగా అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి గురించి చేసిన కామెంట్స్ చేశారు. ఫస్ట్ వన్ సైడ్ లవ్ గురించి చెప్పాలని బన్నికి ప్రశ్న ఎదురుకాగా నా లైఫ్ టైం వన్ సైడ్ లవ్ స్నేహారెడ్డి అని బన్ని కామెంట్లు చేశారు.లైఫ్ లాంగ్ నేను ప్రేమించడమే తప్ప అక్కడినుంచి ఏమీ ఉండదంటూ బన్ని చెప్పుకొచ్చారు.బన్నీ స్నేహారెడ్డి గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. అయితే బన్ని ఇది సరదా కోసమే ఈ కామెంట్స్ చేశాడని అర్థం అవుతోంది. తన భార్యపై అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+