లోకేష్‌ కనగరాజ్ ప్రాజెక్ట్‌ పక్కన పెట్టి డిజాస్టర్ డైరెక్టర్‌కి ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్!

పాన్‌ ఇండియా బాక్సాఫీస్ వద్ద ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకంటే.. కాంబినేషన్ల క్రేజ్, కంటెంట్ క్లారిటీయే ముఖ్యం. ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీసుకున్న ఒక అనూహ్య నిర్ణయం హాట్ టాపిక్‌గా మారింది. తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో సినిమా ఉందంటూ వచ్చిన భారీ హైప్ ఒక్కసారిగా టర్న్ తీసుకుంది. ఆ క్రేజీ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమాకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు ఇప్పుడు ఫిలిం నగర్‌లో గుప్పుమంటున్నాయి.

అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్టు ఆగిపోయిందా? అసలు నిజమేంటి?
అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్టు ఆగిపోయిందా? అసలు నిజమేంటి?

అసలేం జరిగింది?
'పుష్ప' సిరీస్ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాలపై భారీ అంచనాలున్నాయి. 'రాకా' చిత్రం తర్వాత తమిళ మాస్ట్రో లోకేష్ కనగరాజ్‌తో ఆయన చేయబోయే సినిమా ప్రకటన వీడియో సోషల్ మీడియాను ఊపేసింది. ఆ అనౌన్స్‌మెంట్ టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్, అందులోని బీజీఎమ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ల కొద్దీ రీల్స్ పడ్డాయి. ఈ కాంబోపై అభిమానుల్లో ఎక్స్‌పెక్టేషన్స్ తారాస్థాయికి చేరాయి. అయితే, సెట్స్ పైకి వెళ్లకుండానే ఈ ప్రాజెక్ట్ గురించి రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. లోకేష్ కనకరాజ్ వినిపించిన ఫైనల్ స్క్రిప్ట్, ముఖ్యంగా సెకండ్ హాఫ్ అల్లు అర్జున్‌కు సంతృప్తినివ్వలేదని సమాచారం. ఆయన చెప్పిన మార్పులు చేసినప్పటికీ, ఆ స్టోరీ లైన్ తన ఇమేజ్‌కు, ప్రస్తుత ట్రెండ్‌కు ఏమేరకు సూట్ అవుతుందనే సందేహంతో బన్నీ కొంత ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

Allu Arjun sidelined the Lokesh Kanagaraj project to give a chance to a disaster director

సేఫ్ గేమ్‌ వైపు అల్లు అర్జున్ అడుగులు?
లోకేష్ ప్రాజెక్ట్ హోల్డ్‌లో పడటంతో, బన్నీ తన దృష్టిని మరోసారి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను వైపు మళ్లించినట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'సరైనోడు' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి నుంచి బన్నీతో మరో సినిమా చేయాలని బోయపాటి చాలా ప్రయత్నాలు చేశారు. ముంబైకి వెళ్లి మరీ కథ వినిపించిన సందర్భాలున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో, ప్రయోగాల కంటే ప్రస్తుతం సక్సెస్ ట్రాక్, మాస్ ఎంటర్‌టైనర్‌పై నమ్మకంతోనే బన్నీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దసరా పండుగ సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సినిమా ఖరారైందనే సంకేతాలతో బోయపాటి శ్రీను కూడా ఇటీవలే తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు.

మౌళి 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఇక నవ్వుల పండగే..!!
మౌళి 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఇక నవ్వుల పండగే..!!

ఇక్కడ చర్చ ఏంటంటే..
బోయపాటి శ్రీను గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో, ప్రస్తుతం ఆయనపై సోషల్ మీడియాలో, ముఖ్యంగా జెన్-జీ ఆడియన్స్‌లో రకరకాల ట్రోల్స్ వస్తుంటాయి. అలాంటి ఫాంం‌లో లేని డైరెక్టర్‌తో అల్లు అర్జున్ మళ్లీ చేతులు కలపడం సరైన నిర్ణయమేనా? లోకేష్ లాంటి వైవిధ్యమైన దర్శకుడి సినిమాను పక్కన పెట్టి, మాస్ రూట్ ఎంచుకోవడం వెనుక బన్నీ వ్యూహం ఏంటి? ఈ దసరా అనౌన్స్‌మెంట్ ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తుందేమో చూడాలి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+