'పుష్ప2' విడుదల వేళ నోరు జారిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చిత్రం పుష్ప2. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ద్వారా భారీ కలెక్షన్లు కొల్లగొట్టి పాన్ ఇండియా హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐటం సాంగ్ ను శ్రీలీల చేసింది. ఈనెల 17వ తేదీన బీహార్ రాజధాని పాట్నాలో భారీస్థాయిలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేసి సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ తాజాగా తెలుగులో ఆహా ఓటీటీ కోసం బాలకృష్ణ చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే.
రౌండ్ మార్క్ చేసి మరీ కొట్టాను
ఈ షోలో జాతీయ అవార్డు వచ్చినప్పుడు మీరు ఎలా ఫీలయ్యారు? అని బాలయ్య అడిగాడు. దానికి బన్నీ సమాధానమిస్తూ మన తెలుగు హీరోలెవరికీ జాతీయ అవార్డు రాలేదనే బాధ ఉండేది. దాన్ని ఎలాగైనా సరే సాధించాలని టార్గెట్ పెట్టుకొని రౌండ్ చేశాను. రౌండ్ మార్క్ చేసి మరీ దాన్ని కొట్టాను అని చెప్పాడు. మన తెలుగు హీరోలెవరికీ జాతీయ అవార్డు రాలేదనే విషయాన్ని ఇక్కడ అల్లు అర్జున్ చాలా స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు ఇదే విషయం ట్రోలింగ్ కు గురవుతోంది. మెగా అభిమానులు ఈ విషయాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే.. అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు వచ్చిన సమయంలో ఓ ప్రముఖ వార్తా ఛానెల్ ఇంటర్వ్యూ చేసింది.

షాక్ కు గురయ్యానన్న బన్నీ
తనకు జాతీయ అవార్డు వచ్చింది అన్న విషయం తెలిసినప్పుడు ఎంత సంతోషానికి, ఆనందానికి గురయ్యానో అలాగే షాక్ కు కూడా గురయ్యానని బన్నీ చెప్పాడు. అందుకు కారణం అప్పటివరకు తెలుగు హీరోల్లో నలుగురైదుగురికి ఈ అవార్డు వచ్చివుంటుందని, తాను నాలుగోవాణ్నో, ఐదోవాణ్నో అనుకున్నానని ఆ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ చెప్పాడు. తెలుగులో ఎంతోమంది అద్భుతమైన నటులున్నారని, దురదృష్టవశాత్తూ జాతీయ అవార్డు వారికి రాలేదని, ఈ విషయాన్ని తాను ఏదో గొప్పవాణ్ని అనే ఉద్దేశంలో చెప్పడంలేదని, జాతీయ ఉత్తమ నటుడి కేటగిరిలో తెలుగు నుంచి తొలి హీరోగా అవార్డు అందుకోవడం అనేది తెలుగవారందరికీ అంకితం అన్నారు.
ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే మంచిది
అప్పుడు ఒక మాట, షోకు వచ్చిన తర్వాత మరో మాట చెబుతుండటంతో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. తెలిసి కూడా తెలియనట్లుగా వ్యవహరించాడంటూ విమర్శలు వస్తున్నాయి. పుష్ప2 విడుదల సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఆ ప్రభావం సినిమాపై కూడా పడుతుందంటున్నారు. ఈ విషయం అల్లు అర్జున్ అభిమానులకు కూడా నచ్చడంలేదు.












Click it and Unblock the Notifications