అల్లు అర్జున్ రోజూ ఏం తింటారో తెలుసా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 చేస్తున్నారు. డిసెంబరు ఆరోతేదీన విడుదలకు దర్శకుడు సుకుమార్ ముస్తాబు చేస్తున్నారు. వాయిదాలు పడుతూ వస్తోన్న ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలవుతుండటంతో అభిమానులు సంతోషంగా ఉన్నారు. అల్లు అర్జున్ అంటే యూత్ ఐకాన్ అని పేరు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా దేశముదురు సినిమాలో చొక్కా విప్పేసి సిక్స్ ప్యాక్ శరీరం చూపించి ఎందరో ఆడపిల్లల మనసులను దోచాడు. అప్పటినుంచి అల్లు అర్జున్ సినిమా వస్తోందంటే అతని శరీర తత్వం ఎలా ఉంది? (ఫిజిక్), దాన్ని ఎలా నిర్వహిస్తున్నాడు? అందుకు ఎటువంటి ఆహారం తీసుకుంటాడు? అనే ప్రశ్నలు అందరి మదినీ తొలిచేస్తుంటాయి.
కార్బొహైడ్రేడ్ తీసుకుంటే పొట్ట వస్తుంది
ఓసారి దర్శక ధీరుడు రాజమౌళి నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ పాల్గొని పోషకాహార లోపంపై మాట్లాడారు. ఖర్చు తక్కువలో దొరికే, ఖర్చు ఎక్కువలో దొరికే పోషకాహారం ఉంటుందని, ఏదైనా మితంగా తీసుకుంటే ఆరోగ్యమని చెప్పారు. సినిమాల కోసం తాను రకరకాల డైట్ ఫాలో అవుతంటానని, తప్పదన్నారు. సిక్స్ ప్యాక్ కోసం తాను కోడి మాంసం, చేపలు, గుడ్లు తినేవాడినని, కార్బొహైడ్రేడ్ ఫుడ్ మాత్రం మంచిది కాదని, అది తింటే పొట్ట వస్తుందని, పొట్ట కావాలనుకునేవారు అది తీసుకోవచ్చని నవ్వుతూ చెప్పారు.

విదేశాల నుంచి ప్రొటీన్ షేక్స్
ప్రొటీన్ కోసం విదేశాల నుంచి ప్రొటీన్ షేక్స్ తెప్పించుకుంటానని, విదేశాల్లో ప్రొటీన్ చాక్లెట్స్ దొరుకుతాయని, మనదేశంలో దొరకనప్పుడు అక్కడినుంచే తెప్పించుకుంటానని అల్లు అర్జున్ చెప్పారు. అవి చాలా ఖరీదైనవన్నారు. సినిమాల్లో మంచి ఫిజిక్ గా కనిపించాలంటే అవి తప్పవన్నారు. మధ్యాహ్నం సమయంలో చికెన్ బ్రెస్ట్ తినేవాడినని, అందులో 80 శాతం ప్రొటీన్ ఉంటుందన్నారు. సాయంత్రం సమయంలో చేప తీసుకునేవాడినని, నూనె, మసాలా లేకుండా తినేవాడినన్నారు. అలా అని అధికంగా తినకూడదని, క్రమశిక్షణ పాటిస్తేనే మంచి ఆరోగ్యం సొంతమవుతుందన్నారు.












Click it and Unblock the Notifications