రెండు తెలుగు రాష్ట్రాలు ఎదురు చూసింది దీని కోసమే భాయ్ ..!
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సినీ పరిశ్రమతో పాటు రాజకీయ నాయకులు, అశేష అభిమానులు చిరంజీవికి తమ శుభాకాంక్షలు తెలిపారు. ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చి తెలుగు సినిమాకు మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవికి ఈరోజు ప్రతి ఒక్కరూ తమ ప్రేమ, గౌరవం చాటుకున్నారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, తమ గురువుగా, మార్గదర్శిగా ఆయనను కొనియాడారు.
మహేష్ బాబు, చిరంజీవి భారతీయ సినిమాకు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.అగ్ర దర్శకులు, నిర్మాతలు చిరంజీవితో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను పంచుకుంటూ, ఆయన నిరాడంబరత, కష్టపడే తత్వాన్ని ప్రశంసించారు.సినీ పరిశ్రమతో పాటు రాజకీయ నాయకులు కూడా చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు: చిరంజీవి సమాజానికి చేసిన సేవలను అభినందించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం చిరంజీవి తెలుగు సినిమాకు అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.కేంద్ర మంత్రులు, ఇతర నాయకులు చిరంజీవి కళకు, సేవా కార్యక్రమాలకు ఉన్న అంకితభావాన్ని ప్రశంసిస్తూ తమ శుభాకాంక్షలు తెలిపారు.వీరందరు విషెష్ చెప్పడం ఒక ఎత్తు అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం మరో ఎత్తు.
Happy Birthday to our one and only Mega Star Chiranjeevi garu. ⭐️ @KChiruTweets pic.twitter.com/0n9veF0l9X
— Allu Arjun (@alluarjun) August 22, 2025
గత కొద్ది కాలంగా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ సాగుతున్న సంగతి తెలిసిందే. పైకి అంతా బాగానే కనిపించినప్పటికీ లోలోపల మాత్రం అంతర్యుద్ధం సాగుతోంది. ఇటువంటి తరుణంలో అల్లు అర్జున్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతారా లేదా అన్న అనుమానం మొదలైంది. అల్లు అర్జున్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఒక అదిరిపోయే పోస్ట్ పెట్టాడు.
సామాన్యంగా కనిపించే శుభాకాంక్షలకు భిన్నంగా, అల్లు అర్జున్ తన స్టైల్‌కు తగ్గట్టుగా, ఆకట్టుకునే రీతిలో 'హ్యాపీ బర్త్ డే మై వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్' అంటూ ట్వీట్ చేశాడు. ఈ పోస్టులో కేవలం శుభాకాంక్షలు మాత్రమే కాకుండా, చిరంజీవితో కలిసి స్టెప్స్ వేస్తున్న ఒక అరుదైన, హ్యాపీ మూమెంట్‌ను కూడా పంచుకున్నాడు. ఈ ఫోటో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications