Allu Arjun: ఫ్లాప్ చేస్తామన్న వాళ్లంతా పరార్
ఏ మూహుర్తాన 'పుష్ప-2' మొదలు పెట్టారో కానీ అటు రికార్డులతో పాటు, ఇటు వివాదాలకు కూడా కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది ఈ సినిమా. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదంటే అతిశేయోక్తి కాదు. అల్లు అర్జున్‌కి ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిన విషయమే. తెలుగు, కన్నడలో అల్లు అర్జున్‌కు మంచి క్రేజ్ ఉంది. 'పుష్ప' సినిమాతో ఇండియా మొత్తం తనవైపు తిప్పుకునేలా చేశాడు. ఇక 'పుష్ప-2'తో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన స్టామినా నిరూపించాడు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన 'పుష్ప-2' సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.
'పుష్ప 2' ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ. 294 కోట్ల వసూళ్లు రాబట్టింది. దీంతో ఇండియన్ సినిమా చరిత్రలో మొదటిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా పుష్ప 2 నిలిచింది. 14 రోజుల్లోనే ఈ సినిమా రూ.1500 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 'బాహుబలి2' కలెక్షన్లను సైతం 'పుష్ప2' అధిగమించింది. రూ.1800 కోట్ల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా మరో అరుదైన ఘనతను సాధించింది. 100 సంవత్సరాల బాలీవుడ్ చరిత్రలో పుష్ప-2 కొత్త రికార్డ్ సృష్టించింది.

'పుష్ప-2' రూ. 700 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. హిందీ సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా 'పుష్ప 2' నిలిచింది. ఇదే అతిపెద్ద హిందీ నెట్‌గా మారింది.తాజాగా ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తూ కొత్త ప్రోమోను విడుదల చేశారు. అసలు ఈ సినిమా విడుదల సమయంలో విపరీతమైన నెగెటివిటీని మూటగట్టుకుంది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ 'పుష్ప-2' ఫ్లాప్ చేస్తామని సవాలు విసిరారు. కట్ చేస్తే మెగా ఫ్యాన్స్ సైతం 'పుష్ప-2'ని చూసి సినిమాపై ప్రశంసలు కురిపించారు.












Click it and Unblock the Notifications