అల్లు అర్జున్‌తో పూజలు చేయిస్తున్న అల్లు అరవింద్?
తెలుగు సినీ పరిశ్రమలో మెగా కుటుంబానికి, అల్లు అర్జున్ మధ్య హోరాహోరీ యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రధాన కారణం ఇటీవలే జరిగిన ఎన్నికలు. అప్పటికే తీవ్రంగా ఉన్న విభేదాలు కాస్తా ఇప్పుడు మరింత తీవ్రస్థాయికి చేరినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో బన్నీపై మెగా అభిమానులు తీవ్రస్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు. వారికి అల్లు ఆర్మీ కూడా అంతే ధీటుగా బదులిస్తోంది. ఈ ప్రచ్ఛన్న యుద్ధం కాస్తా ఆగస్టు 15వ తేదీన విడుదల కావాల్సిన 'పుష్ప2'ను డిసెంబరు ఆరోతేదీకి వాయిదా పడేలా చేసింది.
నిప్పు రాజేసిన నంద్యాల పర్యటన
అల్లు అర్జున్ కు పుష్ప2 అనేది ఎంతో ప్రతిష్టాత్మకం. అయితే గతంలో కూడా వపన్ కల్యాణ్ గురించి మాట్లాడే సమయంలో 'చెప్పను బ్రదర్' అనడంతో తర్వాత విడుదలైన 'నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా' డిజాస్టరైంది. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకున్న 'పుష్ప2' నిర్మాతలు డిసెంబరుకు సినిమాను వాయిదా వేశారు. ఎన్నికల సమయంలో పవన్ కు అందరూ పిఠాపురం వెళ్లి మద్దతు ప్రకటించి ప్రచారం చేస్తే బన్నీ మాత్రం ట్వీట్ తో సరిపెట్టాడు. అయితే తాను సతీసమేతంగా నంద్యాల వెళ్లి అక్కడి వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం నిప్పు రాజేసింది. పవన్ గెలిచిన తర్వాత కూడా బన్నీ ట్వీట్ చేశాడు.

తల్లి మాట కాదనలేక
'పుష్ప2' వాయిదా పడటం, అట్లీతో చేయాల్సిన సినిమా రద్దవడం, మరికొన్ని కథాచర్చలు జరగకపోవడంలాంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ బన్నీ జాతకంలో దోషం ఉందేమోనని పరిశీలింపచేశారంట. దీని ప్రకారం కుటుంబ సభ్యులంతా ప్రత్యేక పూజలు చేయించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే పూజలతోపాటు హోమాలు కూడా జరగనున్నాయని బన్నీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు షాక్ అవుతున్నారు. అల్లు అర్జున్ కు కూడా ఇటువంటి నమ్మకం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే తన తల్లి అంటే బన్నీకి ఎంతో ప్రేమ. ఆమె మాటను ఎప్పుడూ కాదనలేదు. అందుకే ఆమె పూజలు చేయించాలని నిర్ణయించడంతో కాదనలేక ఓకే చెప్పినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications