అరుదైన ఘనత సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. ఫోర్బ్స్ కవర్ పై మెరిసిన ఐకాన్ స్టార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. లాంగ్ రన్ లో ప్రపంచవ్యాప్తంగా రూ. 1700 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. దాంతో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో అగ్రస్థానం సంపాదించింది. ఈ మూవీలో అల్లు అర్జున్ ప్రత్యేకమైన స్టైల్, మేనరిజమ్స్, డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, భాష ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాకా అనే మూవీ చేస్తున్నారు అల్లు అర్జున్. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.
అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. భారతదేశంలోని టాప్ 100 ప్రముఖ సెలబ్రిటీలను సెలబ్రేట్ చేస్తూ రూపొందించిన ఎంతో ప్రతిష్టాత్మకమైన ఫోర్బ్స్ ఇండియా 'షోస్ టాపర్స్ 2026' ఎడిషన్ కవర్ పై ఆయన తనదైన స్టైల్లో మెరిశారు. వివిధ రంగాల్లో రాణించిన 100 మంది తారల జాబితాను షో స్టాపర్స్ - 2026 పేరుతో ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
🤍@ForbesIndia #CoverStory #Showstoppers2026 pic.twitter.com/XxLExdn1Cz
— Allu Arjun (@alluarjun) August 27, 2026
ఇక సినిమాలతో పాటు అల్లు అర్జున్ కు ఉన్న బ్రాండ్ ఇమేజ్, బాక్సాఫీస్ ప్రభావం, దేశవ్యాప్తంగా పెరుగుతున్న పాపులారిటీకి ఈ గుర్తింపు నిదర్శనంగా నిలిచిందని ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అధికారిక ఎక్స్ మాధ్యమంలో పోస్టు చేశారు. వైట్ కలర్ ఉన్న లవ్ సింబల్ ను జత చేశారు. బన్నీ అరుదైన ఘనత సాధించడంతో ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అటు పలువురు సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం రాకా మూవీ చేస్తున్న అల్లు అర్జున్, ఆ తర్వాత కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ మూవీలో నటించనున్నారు.

ఆ తర్వాత సుకుమార్ తో పుష్ప 3 కూడా సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ లిస్ట్ లో అల్లు అర్జున్ తోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అమితాబ్ బచ్చన్, మోహన్ లాల్, రజనీకాంత్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, ఎఆర్ రహమాన్, బాబీ దియోల్, దుల్కర్ సల్మాన్, మాధవన్, రణ్ వీర్ సింగ్, రిషబ్ శెట్టి, కల్యాణి ప్రియదర్శన్, కంగనా రనౌత్ కూడా ఉండటం విశేషం.












Click it and Unblock the Notifications