అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. సడెన్ గా షెల్వ్ అయిన కొత్త సినిమా..??
సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్ అనేది చాలా ముఖ్యం అని తెలిసిందే. ఓ స్టార్ హీరో.. ఓ స్టార్ డైరెక్టర్ కలిసి పని చేస్తున్నారంటే సాధారణంగానే ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయి. ఇప్పుడు అంతటా పాన్ ఇండియా హవా నడుస్తోంది. కోలీవుడ్ డైరెక్టర్ తో టాలీవుడ్ హీరో.. టాలీవుడ్ డెైరెక్టర్ తో కోలీవుడ్ హీరో.. లేదంటే బాలీవుడ్ డైరెక్టర్ తో టాలీవుడ్ హీరో ఇలా రకరకాల కాంబినేషన్స్ తెరపైకి వస్తున్నాయి. ఇప్పడు తెలుగు సినిమా.. తమిళ్ సినిమా.. హిందీ సినిమా అని లేదు.. ఇండియన్ సినిమా అనేది ఒక్కటే ఉంది. అయితే పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా వ్యాప్తంగా దాదాపు రూ. 1800 కోట్లకు కొల్లగొట్టింది. అల్లు అర్జున్ ను తిరుగులేని పాన్ ఇండియా స్టార్ గా చేసింది.
అయితే పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో అట్లీ దర్శకత్వంలో రాకా మూవీ ఒకటి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రాకా మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే రష్మికా మందన్నా, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, ఐశ్వర్య లక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఇక రాకా మూవీ వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ పూర్తి చేసుకోనుండగా.. 2028లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇక అసలు విషయం ఏంటంటే..? రాకా మూవీతో పాటు కోలీవుడ్ మరో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో అల్లు అర్జున్ ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఓ గ్లింప్స్ కూడా గతంలో రిలీజైంది. కానీ ఈ మూవీ ఆగిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వస్తున్నాయి. ఈ మూవీపై ఇప్పటి వరకూ ఎలాంటి అప్ డేట్స్ రాకపోవడంతో ఈ మూవీ షెల్వ్ అయిందని టాక్ వినిపిస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి లోకేష్ కనగరాజ్- అల్లు అర్జున్ కాంబోలో సినిమా ఉందా..? లేదా..? అనేది మున్ముందు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications
