ఒంటిపై నూలు పోగు లేకుండా స్టార్ బ్యూటీ.. దాదాపు 20 నిమిషాలు !

అమలా పాల్.. దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో, విలక్షణమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది. మలయాళ చిత్రంతో కెరీర్ ప్రారంభించినప్పటికీ, తమిళ, తెలుగు సినిమాల్లో ఆమె అగ్ర కథానాయికగా ఎదిగారు. కేరళలో జన్మించిన ఈ భామ.. మోడలింగ్ రంగం నుండి ఆమె సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2009లో మలయాళ చిత్రం 'నీలతామర'లో ఒక చిన్న పాత్ర ద్వారా ఆమె వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రారంభంలో కొన్ని చిన్న చిత్రాలలో నటించినప్పటికీ.. 2010లో విడుదలైన 'మైనా' మూవీ కెరీర్ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాకుండా, ఆమెకు ఉత్తమ నటిగా విజయ్ అవార్డును తెచ్చిపెట్టింది. 'మైనా' సినిమా విజయంతో అమలా పాల్ రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు. ఆ సక్సెస్ తోనే తెలుగులో నాగచైతన్య సరసన 'బెజవాడ' చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'నాయక్', స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన 'ఇద్దరమ్మాయిలతో' వంటి భారీ కమర్షియల్ చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ మెప్పించారు.

amala-paul-old-movie-aame-now-trending-again-due-to-her-fearless-acting-almost-20-minutes-without-cl

సంచలనం సృష్టించిన మూవీ..

కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా అమలా పాల్ ప్రయోగాత్మక చిత్రాలతో కూడా సత్తా చాటింది. ముఖ్యంగా 'ఆడై' (తెలుగులో 'ఆమె') చిత్రంలో ఆమె పోషించిన పాత్ర సంచలనం సృష్టించింది. ఒక నటిగా ఆమె తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయానికి, బోల్డ్ నటనకు విమర్శకులు ఫిదా అయ్యారు. కథను నమ్మి అమలాపాల్‌ నగ్నంగా నటించడం అంటే చిన్న విషయం కాదు. దాదాపు 20 నిమిషాల పాటు ఒంటిపై నూలు పోగు లేకుండా ఉంటారు. కానీ ఎక్కడ కూడా మనకు ఆ ఫీల్ రాకుండా నటించి మెప్పించారు.

అమలా పాల్ 2014లో తమిళ దర్శకుడు విజయ్ ను వివాహం చేసుకుంది, కానీ 2017లో విడాకులు తీసుకుంది. 2023లో అమలా జగత్ దేశాయ్ ని వివాహం చేసుకుంది. 2024 జూన్ 11న వీరికి ఇలాయ్ అనే మగబిడ్డ జన్మించాడు. కొంతకాలంగా సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన ఆమె ఈ మధ్యే నిర్మాతగా, నటిగా రీఎంట్రీ ఇచ్చింది. మలయాళంలో మమ్ముట్టి సరసన 'క్రిస్టోఫర్', పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన బ్లాక్‌బస్టర్ చిత్రం 'ఆడుజీవితం' (The Goat Life) లో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆమె అటు సినిమాలు, ఇటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై వైవిధ్యమైన ప్రాజెక్ట్‌లతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+