ఆ సినిమా చూసి డైరెక్టర్, హీరోయిన్‌ని పిచ్చి కొట్టుడు కొట్టారు !
స్టార్ బ్యూటీ అమలా పాల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. 2009లో రిలీజ్ అయిన మలయాళ చిత్రం నీలతామర సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ తర్వాత తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఇద్దరమ్మాయిలతో, నాయక్, బెజవాడ సినిమాలతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించి పాన్ ఇండియా లెవెల్లో అభిమానులను సొంతం చేసుకుంది.
కాగా అమలా పాల్ ఆ తర్వాత తమింళంలో డెబ్యూ చేసిన మూవీ సింధు సామవేళి. 2010లో వచ్చిన ఈ చిత్రం కాంట్రవర్సీ కూడా అయింది. మృగం వంటి డిఫరెంట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ సామి సింధు సామవేళి చిత్రానికి దర్శకత్వం వహించారు. అమలా పాల్, హరీష్ కల్యాణ్, గజిని, గంజా కరుప్పు ప్రధాన పాత్రల్లో నటించారు. చిత్రాన్ని తెలుగులో నేటి చరిత్ర అనే టైటిల్‌తో డబ్ చేసినప్పటికీ అప్పట్లో విడుదల కాలేదు.

కథ విషయానికి వస్తే..
స్కూల్ నుంచి ఫ్రెండ్స్ అయిన ఇద్దరు ఆ తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అయితే కొడుకు చదువు నిమిత్తం వెళ్లినప్పుడు ఎక్స్ మిలిటెంట్ అయిన మామ కోడలితో నిర్వహించిన అక్రమ సంబంధం కథాంశంతో ఈ మూవీ సాగుతుంది. కాన్సెప్ట్ మాత్రమే కాకుండా రొమాంటిక్ సీన్లతో బోల్డ్‌గా తెరకెక్కించారు. దాంతో ఈ సినిమాలోని రొమాంటిక్ సీన్స్ పెద్ద వివాదాన్ని సృష్టించాయి. మహిళా సంఘాలు కూడా ఈ సినిమా పై మండిపడ్డాయి.
అంతే కాకుండా ఈ మూవీ డైరెక్టర్ ను చితకొట్టుడు కొట్టారు. హీరోయిన్ అమలాపాల్ పై కూడా దాడి జరిగింది. గతంలో ఈ సినిమా గురించి అమలాపాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెరీర్ బిగినింగ్ లో ఆ సినిమా చేసి తప్పు చేశానని.. ఆ సినిమా తన జీవితం పై ప్రభావం చూపిందని తెలిపింది. ఆ సినిమా సమయంలో తనకు కేవలం 17 ఏళ్లు మాత్రమే అని తెలిపింది.

ఇక అమలా పాల్ 2014లో తమిళ దర్శకుడు విజయ్ ను వివాహం చేసుకుంది. కానీ 2017లో విడాకులు తీసుకుంది. 2023లో జగత్ దేశాయ్ ని వివాహం చేసుకుంది. 2024 జూన్ 11న వీరికి ఇలాయ్ అనే మగబిడ్డ జన్మించాడు. కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆమె ఈ మధ్యే నిర్మాతగా, నటిగా రీఎంట్రీ ఇచ్చింది.












Click it and Unblock the Notifications