సమంతకు భారీ షాక్.. ఆశలు అన్నీ ఆవిరి అయిపాయే !
కుందనపు బొమ్మ, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు భారీ షాక్ తగిలింది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత తెలుగులో సినిమాలు తగ్గించేసిన ఈ భామ.. బాలీవుడ్ పైనే నమ్మకం పెట్టుకుంది. ఈ క్రమంలోనే హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ నటించిన 'సిటడెల్' వెబ్ సిరీస్‌కి ఇండియన్ వెర్షన్ తెరకెక్కించారు. 'సిటడెల్: హనీ-బన్నీ' పేరుతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్, సమంత జంటగా నటించారు. అమెజాన్ వేదికగా రిలీజ్ అయిన ఈ సిరీస్ ఆశించిన రేంజ్ లో లేకపోయినా.. సమంతకు మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. దీనికి పార్ట్ 2 కూడా ఉంటుందని అప్పట్లోనే అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా ఆ సిరీస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది.
సిటడెల్: హనీ-బన్నీ సీజన్ 2 ను రద్దు చేస్తున్నట్టు అమెజాన్ ప్రకటించింది. కేవలం ఇండియన్ వెర్షన్ ని మాత్రమే కాకుండా ఇటాలియన్ వెర్షన్ సిటడెల్ - డయానా సెకండ్ సీజన్ కూడా రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. అయితే వీటి కొనసాగింపు కథలను ఒరిజినల్ సిరీస్ లో విలీనం చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ సిరీస్ అన్ని భాషల్లో మంచి విజయం సాధించిందని.. ఒరిజినల్ వెర్షన్ ని మరింత గొప్పగా చిత్రీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ప్రియాంక చోప్రా 'సిటడెల్' పార్ట్ 2 2026లో రిలీజ్ చేస్తామని తెలిపారు.

దీంతో సమంతకు గట్టి షాక్ తగిలిందని భావిస్తున్నారు. ఆ సిరీస్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టడంతో బాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తాయని భావించింది. కానీ ప్రస్తుతం ఒకటి, రెండు ఆఫర్లు తప్ప కొత్తగా ఏం రాలేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అమెజాన్ ఊహించని రీతిలో సిరీస్ రద్దు చేయడంతో ఆఫర్లు మరింత తగ్గే ఛాన్స్ ఉందని అంటున్నారు. సమంత ప్రస్తుతం "రక్త బ్రహ్మాండ్" వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. పలు చిత్రాల్లో నటిస్తూనే.. నిర్మాతగా మారిన సామ్ 'ట్రలాలా' పేరుతో ప్రొడక్షన్ హౌజ్‌ను ప్రారంభించింది. ఈ బ్యానర్‌పై తెరకెక్కించిన తొలిచిత్రం 'శుభం' ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలో విడుదలకు కూడా రిలీజ్ అయ్యింది ఈ మూవీ.
మరోవైపు గత కొంత కాలంగా సమంత .. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోర్‌తో డేటింగ్ లో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం సామ్- రాజ్ కలిసి పికిల్ బాల్ టోర్నమెంట్‌లో కనిపించారు. ఆ కార్యక్రమంలో ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఉండడం ఫుల్ హాట్ టాపిక్ అయ్యింది. టాడేల్ - హనీ - బన్నీ వెబ్ సిరీస్ కి కూడా రాజ్ అండ్ డీకేనే దర్శకత్వం వహించారు. దాంతో వీరు రిలేషన్ షిప్ లో ఉన్నారని భావిస్తున్నారు. త్వరలోనే వీరి ప్రేమ విషయం అధికారికంగా వెల్లడించనున్నారని ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications