మనుషులు లేని సినిమా! ఏఐ సంచలనం "అంబా’స్ రివేంజ్" టీజర్ లాంచ్!

లేటెస్ట్ టెక్నాలజీ ఆధారంగా రూపొందుతున్న వినూత్న చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అందులో భాగంగా నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్‌పై జైవర్ధన్ మేడి దర్శకత్వంలో యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి, రాణి మాడిసన్ నిర్మాతలుగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఏఐ చిత్రం "అంబా'స్ రివేంజ్".ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని మీడియా సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మనుషుల ప్రమేయం లేకుండా కేవలం ఏఐ సాంకేతికతతో మాత్రమే రూపుదిద్దుకోవడం ఈ చిత్రం ప్రత్యేకత.

భారతీయ ఇతిహాసమైన మహాభారతంలోని అత్యంత కీలకమైన అంబ ప్రతీకారం అనే ఘట్టాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను మలిచారు. ఓ జన్మలో బీష్ముని కారణంగా మరణించిన అంబ.. మరసటి జన్మలో శిఖండిగా మారి అతడిపై పగ ఎలా తీర్చుకుందనే ఆసక్తికరమైన ప్రయాణాన్ని ఇందులో చూపించబోతున్నారు. నేటి తరం ప్రేక్షకులకు సులభంగా అర్థమయ్యే రీతిలో విజువల్ ఫీస్ట్‌గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాకు ప్రమోద్ ఎంసీ సంగీతం అందించిన ఈ ఏఐ చిత్రానికి హ్యారీ బ్రెయిన్ ఎడిటింగ్ చేయగా.. కిషోర్ కుమార్ ఏనుగు డైలాగ్స్, లిరిక్స్ అందించారు.

Amba s Revenge Teaser Launch India AI Generated Movie Amba s Revenge Movie Teaser Out Details

ఈ కార్యక్రమంలో దర్శకుడు జైవర్ధన్ మేడి మాట్లాడుతూ.. "ఈ సినిమా కథ అంబ ప్రతీకారం అయినప్పటికీ.. ప్రేక్షకులు దీనిని శిఖండి కోణం నుంచి చూడబోతున్నారు. సినిమాలో ప్రధాన పాత్రలను పరిచయం చేసే ఉద్దేశంతోనే ఈ టీజర్‌ను డైలాగ్స్ లేకుండా విజువల్స్‌తో మాత్రమే విడుదల చేశాం. అతి త్వరలోనే పూర్తిస్థాయి సంభాషణలతో కూడిన ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం" అని వెల్లడించారు.

నిర్మాత యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి మాట్లాడుతూ... "ఏఐలో సినిమా చేయడం చాలా ఖర్చుతో కూడిన విషయం. సాధారణంగా ఇటువంటి సినిమా చేయాలంటే తక్కువ ఖర్చు అనుకుంటారు కానీ మేము ఒక టూల్ ఉపయోగించేలోపు మరొక టూల్ వస్తుంది. అలాబ్మాకు ఖర్చు ఎక్కువ అయింది. ప్రస్తుతం అందరూ రీల్స్‌లో ఏఐ చూస్తున్నారు కానీ ఈ సినిమా చాలా అద్భుతంగా ఉండబోతుంది" అన్నారు.

డైలాగ్స్, లిరిక్స్ రచయిత కిషోర్ కుమార్ ఏనుగు మాట్లాడుతూ.." ఈ సినిమాలో 2 పాటలు ఉంటాయి. నేటి తరానికి అర్థం అయ్యేలా ఈ చిత్రాన్ని తెరకి ఎక్కించడం జరిగింది" అన్నారు. ఎడిటర్ హ్యారీ బ్రెయిన్ మాట్లాడుతూ... "ప్రస్తుతం వస్తున్న కొన్ని ఏఐ రీల్స్ వల్ల ప్రేక్షకులకు ఏఐ సినిమా అంటే ఒక అవగాహన ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా మంచి విజువల్ ఫీస్ట్ ఇస్తుంది. అందరూ సినిమాను ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాను" అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+