విడాకులకు సిద్థమైన మరో స్టార్ హీరోయిన్..? సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడంతో క్లారిటీ

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకోబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. తన భర్త అభిషేక్ బచ్చన్ నుంచి ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారని గత కొంతకాలంగా మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా ఈ వార్తలకు బలం చేకూర్చేలా బచ్చన్ ఫ్యామిలీ వ్యవహరించడంతో అందరూ ఇది నిజమే అని నిర్థారణకు వచ్చేశారు.

ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బచ్చన్ జంట 2007లో వివాహం చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది. 16 ఏళ్లు బాగానే సాగిన కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. తాజాగా జరిగిన ఓ ఘటనతో ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బచ్చన్‌లు విడిపోతున్నారనే అభిప్రాయానికి అందరూ వచ్చేశారు.

 Amitabh Bachchan unfollows Aishwarya Rai on Instagram

బిగ్ బి అమితాబ్ తన కొడులు ఐశ్వర్యరాయ్‌ను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశారు. ఇది చూసిన నెటిజన్లు ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బచ్చన్‌ విడాకులు తీసుకుంటున్నారని.. అందుకే అమితాబ్ ఐశ్వర్యరాయ్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేశారని చర్చించుకుంటున్నారు. సెలబ్రిటీలు విడిపోయే ముందు ఇలాగే సోషల్ మీడియాలో అన్ ఫాలో చేస్తారని..ఇప్పుడు ఐశ్వర్యరాయ్ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

నాగ చైతన్య - సమంత, నిహారిక-చైతన్యల ముందు ఇలాగే సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకున్నారని గుర్తు చేస్తున్నారు. అయితే అటు ఐశ్వర్యరాయ్ కాని ,ఇటు అభిషేక్ బచ్చన్‌ కాని ఎవరూ కూడా విడాకులపై ఇప్పటి వరకు స్పందించింది లేదు. దాంతో ఐశ్వర్యరాయ్ జంట విడాకులు తీసుకుంటున్నారని వస్తున్న వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+