డీప్‌ఫేక్ బాధితురాల్లో నిన్న రష్మిక... నేడు కత్రినాకైఫ్..
టాలీవుడ్ నటి రష్మిక మందనా డీప్‌ఫేక్ మార్ఫింగ్ వీడియోల సంగతి అందరికీ తెలిసిందే. ఈ సంఘటలనో సీని పరిశమ్ర ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే, జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి ఏఐ సాంకేతికతతో రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ఆ వీడియోలను పోస్ట్ చేశారు.
ఆ వీడియోలో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆ ఘటనతో సినీ పరిశ్రమ ఇంకా తేలుకోకుముందే మరో డిప్‌ఫేక్ మార్పిండ్ వీడియో బయటికి వచ్చింది. అయితే ఈసారి బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కత్రినాకు సంబంధించిన కొన్ని డీప్‌ఫేక్ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.

డీప్‌ఫేక్ ఫొటోల్లో కత్రీనా లో దుస్తులతో: తాజాగా కత్రీనా కైఫ్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన టైగర్ 3 చిత్రంలో కలిసి నటించారు. అయితే ఈ సినిమాలో కత్రీనా చేసినా టవల్ ఫైట్ సీన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే, ఇందులో కత్రీనా ఓ హాలీవుడ్ స్టంట్ ఉమన్‌తో కలిసి పోరాడుతుంది. ఆ పోరాట దృశ్యాలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
ఈ సీన్‌పై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈ దృశ్యాలనే కొందరూ మిస్‌యూజ్ చేశారు. ఒరిజినల్ ఫైట్‌సీన్‌లో కత్రినా టవల్ కట్టుకుని ఫైట్ చేయగా, ఏఐ సాంకేతికతో వాటిని మార్ఫింగ్ చేశారు. డీప్‌ఫేక్ ఫొటోల్లో కత్రినా లోదుస్తుల్లో ఫైట్ చేస్తున్నట్లు చూపించారు. దీంతో ఇది కాస్త ఇప్పుడు బీటౌన్ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

టైగర్ 3 సినిమాకు మనీశ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా హై బడ్జెట్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్ సినిమాపై బారీ అంచనాలనే పెంచుతున్నాయి. ఈ సినిమాలో కత్రినాకైఫ్‌పై వచ్చే యాక్షన్ సీన్‌పై ఇప్పుడు నెట్టింట తెగ చర్చ నడుస్తోంది.












Click it and Unblock the Notifications