ఈ సినిమా ఇంటర్వెల్, క్లైమాక్స్ చూస్తే థ్రిల్ అయిపోవడం పక్కా..!
భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై తెరకెక్కిన తాజా చిత్రం 'అనకాపల్లి'. ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ రా అండ్ రస్టిక్ మూవీ అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నిర్వహించిన మీడియా సమావేశం సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. గ్రామీణ వాతావరణం, నేటివిటీకి తగ్గట్టుగా ఈ సినిమాను పూర్తిగా రా అండ్ రస్టిక్‌గా దర్శకుడు ఖగేష్ తమ్మినేని తెరకెక్కించారు.
ఈ చిత్రానికి సంబంధించి ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ అత్యంత కీలకంగా నిలవనున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ ఊహించని విధంగా ఉంటుందని, క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉండి అందరినీ కదిలిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. విక్రమ్ సహిదేవ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడి సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. సంధ్యా వశిష్ట నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుండగా, తారక్ పొన్నప్ప తన పవర్‌ఫుల్ విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టడం ఖాయం. ఇంద్రజ తదితరుల పాత్రలు కూడా కథను మరింత బలోపేతం చేశాయి.

ముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన అందించిన కథ, స్క్రీన్ ప్లే ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్. 'మేం వయసుకు వచ్చాం' తర్వాత త్రినాథరావు నుండి వస్తున్న అద్భుతమైన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ , ఫ్యామిలీ డ్రామా ఇది. చిత్ర నిర్మాత కాండ్రేగుల నాయుడు, కో-ప్రొడ్యూసర్ కాండ్రేగుల కుమార్ రాజా ప్యాషన్‌తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. లగడపాటి శ్రీధర్ సపోర్ట్‌తో పాటు, ఇప్పటికే ఓపెన్ అయిన బుకింగ్స్‌కు వస్తున్న అద్భుతమైన స్పందన చూస్తుంటే 'అనకాపల్లి' బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications
