ఆ విషయం వల్లే షూటింగ్ అప్పుడు క్యారవాన్‌లో కూర్చొని ఏడ్చా ..!

అనన్య నాగళ్ల.. టాలీవుడ్ లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న తెలుగు హీరోయిన్ లలో ఆమె కూడా ఒకరు. చిన్న సినిమాల ద్వారా సినీ ప్రయాణం మొదలుపెట్టినా కూడా.. ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. 2018లో వచ్చిన 'మల్లేశం' చిత్రంలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి " వకీల్ సాబ్ " చిత్రంలో నటించి మెప్పించింది.

ఇక ఆ తర్వాత 'శాకుంతలం', హారర్ థ్రిల్లర్ 'తంత్ర', గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన 'పొట్టేల్' వంటి విభిన్నమైన కథలతో ముందుకొచ్చింది. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమవకుండా, కథల బలాన్ని నమ్మే నటిగా అనన్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హై-బడ్జెట్ చిత్రాలు, చిన్న సినిమాలు అనే తేడా లేకుండా తన పాత్రకు న్యాయం చేయడంతో నిర్మాతలు సైతం మీడియం బడ్జెట్ సినిమాల విషయంలో ఆమె కోసం క్యూ కడుతున్నారు.

ananya-nagalla-opens-about-her-love-break-up-in-interview

పర్సనల్ లైఫ్..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనన్య తన పర్సనల్ విషయాలను గురించి ఓపెన్ అయ్యారు. కాగా నటిగా అవ్వడానికి ముందు బీ టెక్ పూర్తి చేసి కార్పొరేట్ రంగంలో పనిచేసినట్టు చెప్పుకొచ్చారు. అంతే కాకుండా తన బ్రేకప్ గురించి చెబుతూ ఎమోషనల్ అవ్వడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

క్యారవాన్ లో ఏడ్చా..

ఇండస్ట్రీకి వచ్చాక కొంతకాలానికే తనకు బ్రేకప్ జరిగిందని వెల్లడించింది. అది తన జీవితంలో ఎదురైన పెద్ద షాక్ అని.. దాదాపు రెండేళ్ల పాటు ఆ విషయంలో బాధ పడ్డానని వాపోయారు. కానీ బయటకి ఎప్పుడూ ఆ విషయాన్ని చూపించలేదని.. రాత్రిపూట ఏడ్చిన కూడా, ఉదయానికి జిమ్‌కి వెళ్లేదాన్ని అని చెప్పారు. కారవాన్‌లో కన్నీళ్లు పెట్టుకున్నా.. షూటింగ్ టైమ్ వచ్చేసరికి చిరునవ్వుతో వర్క్ మొదలుపెట్టేదాన్ని అంటూ ఓపెన్ అయ్యారు. తన బాధ కుటుంబానికి కూడా చెప్పలేదని వ్యాఖ్యానించారు.

తనను నమ్మి అవకాశం ఇచ్చిన డైరెక్టర్లు, నిర్మాతలను నిరాశపరచకూడదని ధృడ సంకల్పంతో పని చేశానని స్పష్టం చేసింది అనన్య. పర్సనల్ విషయాలను కూడా ఓపెన్ గా చెప్పి.. ఎప్పుడూ ఏ విషయంలో క్రుంగిపోకూడదు అని చెప్పడం పట్ల ప్రశంసలు వస్తున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాస్త అందాలు ఆరబోస్తూ ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+