బ్రేకప్ చెప్పిన విజయ్ దేవరకొండ హీరోయిన్
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంనే మాట్లాడుతుంటారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ బ్రేకప్ స్టోరీ వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ లిస్ట్‌లో అనన్య పాండే కూడా ఒకరు. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురుగా ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే , అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. జీరో సైజ్ బ్యూటీ పేరుతో అనన్య పాండే ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ''స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'' సినిమా అనన్య పాండే కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది అమ్మడు. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ''లైగర్'' సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనన్య పాండే తన వ్యక్తిగత విశేషాలతో పాటు, సినిమా విషయాలను కూడా వెల్లడిస్తుంటుంది. ఇక అమ్మడుకు లవ్ స్టోరీల కూడా ఎక్కువగానే ఉన్నాయి. అనన్య పాండే గతంలో ఇషాన్ ఖత్తర్, కార్తిక్ ఆర్యన్ వంటి హీరోలతో డేటింగ్ చేసింది. ఆశికీ 2 హీరో ఆదిత్యరాయ్ కపూర్‌తో కూడా అనన్య పాండే రిలేషన్‌లో ఉందనే వార్తలొచ్చాయి. దీనికి తగ్గట్టుగానే వీరిద్దరు కలిసున్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆదిత్యరాయ్ కపూర్‌కు బ్రేకప్ చెప్పింది ఈ బ్యూటీ.
కొద్ది నెలల నుంచి వీరిద్దరు కలిసున్న ఫొటో ఒక్కటి కూడా బయటకు రాలేదు. దీంతో వీరిద్దరు వీడిపోయారనే అంతా భావిస్తున్నారు. ఇదే సమయంలో టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో అనన్య పాండే డేటింగ్ చేస్తోందంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరు కలిసి అంబానీ పెళ్లిలో సందడి చేశారు. హిందీ పాటలకు ఇద్దరు కలిసి చిందులు వేసిన వీడియోలు సోషల్ మీడియిలో తెగ వైరల్ అయ్యాయి. దీనికి తోడు సోషల్ మీడియాలో వీరిద్దరు ఒకర్ని ఒకరు ఫాలో అవుతున్నారు. దీంతో అనన్య పాండే, హార్దిక్‌లు రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. అంబానీ పెళ్లి తర్వాత వీరిద్దరు తరుచుగా కలుసుకుంటున్నారని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇటు హార్దిక్ భార్యకు విడాకులు ఇవ్వడం, అటు అనన్య పాండే పలువురు హీరోలకు బ్రేకప్ చెప్పి సింగిల్‌గా ఉండటంతో వీరిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications