ఆడపిల్లను కందామంటే మా ఆయన సహకరించడంలేదు: అనసూయ
న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ తర్వాత యాంకర్ గా రాణించింది. ప్రస్తుతం సినిమాల్లో కీలకమైన పాత్రలు పోషిస్తోంది. రోజురోజుకు సినిమా అవకాశాలు పెరుగుతుండటంతో యాంకరింగ్ కు గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం సినిమా అవకాశాలు కూడా తగ్గాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అనసూయ ఈ మధ్య బికినీలో భర్తతో కలిసి బీచ్ లో సందడి చేసింది.
తాజాగా యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను వెల్లడించింది. తనకు ఆడపిల్లను కనాలని ఉందని, కానీ తన భర్త భరద్వాజ్ అందుకు సహకరించడంలేదని బోల్డ్ కామెంట్స్ చేసింది. తన అత్తగారి కుటుంబం బీహార్ కు చెందినదని, అక్కడ సంప్రదాయాలు ఎక్కువ అని చెప్పింది. పదిమందిలో కొంగు కప్పుకొనే ఉండాలని, అక్కడికి వెళ్లినప్పుడు తాను అలాగే ఉంటానని చెప్పింది.

తనకు ఆడపిల్లను కనాలని ఉందని ఇటీవలే తన అత్తగారికి చెప్పానని, కానీ ఆమె కోప్పడ్డారని తెలిపింది. ఇందుకు బిహార్‌లో ఉన్న కట్టుబాట్లే కారణమని వెల్లడించింది. అక్కడ మగవారి డామినేషన్ ఉంటుందని చెప్పింది. తన పిల్లలకు చెల్లిని ఇస్తా అంటే తన చిన్న కొడుకు ఆగ్రహం వ్యక్తం చేశాడని పేర్కొంది. అమ్మాయిని కంటారా అని చివరకు యాంకర్ ప్రశ్నించగా, తనకు కనాలనే ఉందని, తన భర్త భరధ్వాజ్ సహకరించడం లేదని ఓపెన్ అయింది. ఆడపిల్ల ఉన్న ఇల్లు ప్రశాంతంగా, అణకువగా, లక్ష్మీదేవిలా కళకళలాడుతూ ఉంటుందని తెలిపింది. ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను వైన్ తాగుతానని, అందులో తప్పేముందని ఎదురు ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications