ఆ హీరో ఒత్తిడి చేశాడు - అనసూయ

యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ తర్వాత యాంకర్‌గా , హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది. ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే..అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందం , అభినయం రెండు ఉన్న అనసూయకు వివాదాలు కూడా కొత్తేం కాదు. బహిరంగంగానే ముద్దులు, హగ్గులు, బికినీలతో రచ్చ చేస్తూ..ట్రోలింగ్ బారిన పడుతున్నారామె.

అనసూయ ఏం చేసిన కూడా సంచలనమే అన్నట్టుగా ఉంటుంది. ఇక హీరో విజయ్ దేవరకొండతో వివాదం గురించి అందరికి తెలిసిందే. తనని విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా సమాధానం కౌంటరిస్తుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ. 38 ఏళ్ల వయస్సులో కూడా సూపర్ హాట్‌గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది. గ్లామర్‌గా కనిపించడానికి అనసూయ తెగ కష్టపడుతుంటుంది. ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే.

Anasuya Bharadwaj comments on adivi sesh

చీరకట్టినా, మోడ్రన్ డ్రెస్ వేసినా తన చూపులతోనే గుచ్చేసే అనసూయ.. తాజాగా ఓ హీరో గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. హీరో అడివి శేష్‌తో కలిసి అనసూయ క్షణం అనే మూవీలో నటించారు. ఈ సినిమాలో అనసూయ పోలిస్ ఆఫీసర్‌గా కనిపించి మెప్పించారు. సినిమాలో ట్విస్ట్ ఏమిటంటే.. చివర్లో అనసూయనే విలన్ కావడం. ఈ సినిమాలో నటనగానూ అనసూయకు మంచి పేరొచ్చింది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా తర్వాతే అనసూయకు సినిమాల్లో అవకాశాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా గురించి అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మొదట్లో నా ఫోర్‌హెడ్ చూపించడానికి బాగా భయం వేసేది. కానీ అడివి శేష్ ఫోర్స్ చేయడంతో నా వెంట్రుకలను లైట్‌గా దువ్వుకొని జడ వేసుకున్నాను. దాంతో నా ఫోర్‌హెడ్ చూపించాల్సి వచ్చింది. అంతకు ముందు నన్ను అందరూ బట్ట తల దానా అనేవారు. ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత నా ఫోర్ హెడ్‌ను ధైర్యంగా చూపించగలుగుతున్నానని అనసూయ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+