పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ

అనసూయ భరద్వాజ్‌.. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేని వ్యక్తి. టెలివిజన్‌లో న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. ఈటీవీ షో 'జబర్దస్త్‌' ద్వారా బాగా ఫెమస్ అయ్యి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ క్రేజ్ ద్వారానే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. 40 ఏళ్ల వయస్సులో కూడా సూపర్ హాట్‌గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది. క్షణం, రంగస్థలం, పుష్ప చిత్రాల్లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.

అలానే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ పలు అంశాలపై రియాక్ట్ అవుతూ ఉంటారు. ముద్దులు, హగ్గులు, బికినీలతో ఉండే పోస్టులు సైతం షేర్ చేస్తూ..ట్రోలింగ్ బారిన పడుతూ ఉంటారు. తనని విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా కౌంటరిస్తుంటుంది ఈ హాట్ బ్యూటీ. ఈ నేపథ్యంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె తన అభిమాన హీరో గురించి.. వ్యక్తిగత ప్రేమ జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ చర్చనీయాంశంగా మారాయి.

anasuya-bharadwaj-interesting-comments-on-dating-with-ram-charan-if-she-is-not-married-goes-viral

అతనంటే చాలా ఇష్టం..

అనసూయ తన ప్రేమ జీవితం గురించి మాట్లాడుతూ.. "నా లైఫ్ లో ఒకే ఒక్క బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అతన్నే పెళ్లి చేసుకున్నానని సరదాగా వ్యాఖ్యానించింది. అలానే పెళ్లి కాకుండా ఉంటే ఏ హీరోతో డేటింగ్ చేస్తారని అడిగినప్పుడు.. ఏమాత్రం తడబడకుండా రామ్ చరణ్ పేరు చెప్పేశారు. అంతే కాకుండా చరణ్ అంటే చాలా ఇష్టమని ఓపెన్ అయ్యారు. రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమాలో 'రంగమ్మత్త'గా అనసూయ నటనకు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు రామ్ చరణ్‌పై ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+