Anasuya న్యాయ పోరాటం.. వారందరిపై సెక్సువల్ హెరాస్‌మెంట్ కేసు

టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సీరియస్ యాక్షన్ లోకి దిగారు. తనకు జరుగుతున్న వేధింపులపై పోరాటానికి సమర శంఖం పూరించారు. ఈసారి తెరపై కాదు... చట్టపరమైన వేదికపై పోరాటానికి దిగారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ గడప తొక్కారు. సోషల్ మీడియాలో తనపై సాగుతున్న అసభ్యకర వేధింపులు, మార్ఫింగ్ ఫోటోలు, AIతో తయారుచేసిన వీడియోలపై ఆమె పోలీసులను ఆశ్రయించగా... ఈ వ్యవహారం ఇప్పుడు సంచలన క్రైమ్ కేసుగా మారింది. సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే 42 మందిపై కేసులు నమోదు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది.

కేవలం ట్రోలింగ్ వరకే పరిమితం కాకుండా... తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా లైంగిక వ్యాఖ్యలు, బెదిరింపులు, అసభ్య వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారని అనసూయ తన ఫిర్యాదులో స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి తయారుచేసిన మార్ఫింగ్ కంటెంట్ తన గౌరవాన్ని, భద్రతను ప్రమాదంలోకి నెట్టిందని ఆమె పేర్కొన్నారు. ఇది కేవలం మానసిక వేధింపే కాదు... తన జీవనోపాధి, ప్రజా జీవితంపై ప్రత్యక్ష దాడి అని ఫిర్యాదులో వివరించారు.

Anasuya Bharadwaj Takes Legal Action as Cyber Crime Police Book 4 Accused Over AI Based Harassment

సెక్షన్లు ఇవే..

ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్న పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) తో పాటు ఐటీ చట్టంలోని కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. BNS సెక్షన్లు 75, 79, 336(4), 351, 356, IT చట్టం 66E, 67 నమోదు చేశారు. ఈ సెక్షన్లు లైంగిక వేధింపులు, పరువు నష్టం, సైబర్ నేరాలకు సంబంధించి అత్యంత కఠినమైనవిగా పరిగణిస్తారు.

పొలిటికల్ లీడర్లు, జర్నలిస్టులు..

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో సినీ రంగానికి చెందినవారితో పాటు, జర్నలిస్టులు, టీవీ యాంకర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఉండటం కలకలం రేపుతోంది. బొజ్జ సంధ్యారెడ్డి, ప్రియాచౌదరి గోగినేని, పావని, శేఖర్ బాషా, రజని, కరాటే కల్యాణి, విజయలక్ష్మి, టీవీ యాంకర్ రోహిత్, మరో ఛానల్ యాంకర్, అలాగే దుర్గ, టీవీ యాంకర్ మనోజ్ సహా పలువురు ఈ కేసులో నిందితులుగా ఉన్నట్లు సమాచారం. అనేక టీవీ ఛానళ్లు, ఆన్‌లైన్ మీడియా పేజీలను కూడా కేసులో చేర్చారు.

నిందితుల పేర్లతో పాటు తమపై జరిగిన దాడులకు సంబంధించిన సోషల్ మీడియా లింకులు, పోస్టులు, వీడియోల ఆధారాలను అనసూయ స్వయంగా పోలీసులకు సమర్పించారు. తనపై ఇది యాదృచ్ఛికంగా జరగలేదని, పక్కా క్యాంపెయిన్ తరహాలో ప్లాన్ చేసి దాడి చేశారని ఆమె ఆరోపించారు. ఒక మీడియా ఇంటర్వ్యూలో తన అభిప్రాయం చెప్పిన తర్వాతే ఈ వేధింపులు మొదలయ్యాయని వెల్లడించారు.

మొత్తానికి... ఇది కేవలం ఒక సెలబ్రిటీపై జరిగిన సైబర్ దాడి మాత్రమే కాదు. AI టెక్నాలజీని ఆయుధంగా మార్చుకుని మహిళలను వేధిస్తున్న నేరానికి వ్యతిరేకంగా మొదలైన చట్టపరమైన పోరాటం. ఈ కేసు ఎలా మలుపులు తిరుగుతుందో... ఎవరికెవరికీ చట్టం చుట్టుకుంటుందో అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+