'ప్లీజ్ నన్ను క్షమించండి'.. అనసూయ ఎమోషనల్ పోస్ట్..
సీనియర్ హీరోయిన్ రాశి విషయంలో క్షమాపణలు చెప్పారు అనసూయ భరద్వాజ్. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మూడేళ్ల క్రితం ఓ షోలో నటి రాశిపై అనసూయ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ స్కిట్ లో తనతో డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించారని తాజాగా ఎక్స్ లో పోస్ట్ చేశారు అనసూయ. ఆ వ్యాఖ్యలు రాయించి, డైరెక్ట్ చేసిన వ్యక్తిని ఆ రోజునే నిలదీయాల్సి ఉండగా అప్పుడు తనకు అంత శక్తి లేక సైలెంట్ గా ఉన్నానని అన్నారు. మనుషులు మారుతారని.. ఆ షో విడిచి పెట్టాక తనలో మార్పును గమనించాలని కోరారు. ఈ మేరకు అనసూయ పోస్టు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

సీనియర్ నటి రాశికి క్షమాపణలు చెప్పారు అనసూయ. ఈమేరకు తన అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా పోస్టు పెట్టారు. " డియర్ రాశి గారు.. మీకు నా క్షమాపణలు.. మూడేళ్ల క్రితం నేను చేసిన ఓ షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్ లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించారు. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తుల్ని నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది. కానీ నాకు అప్పుడు ఉన్నటువంటి శక్తి సరిపోలేదు. అది పొరపాటే.. ప్లీజ్ నా క్షమాపణలను స్వీకరించండి..
— Anasuya Bharadwaj (@anusuyakhasba) January 5, 2026
వెనక్కు వెళ్లి ఇప్పుడు నేను దాన్ని సరిదిద్దలేను. పీపుల్ చేంజ్ అండ్ ఎవాల్వ్. ఆ షో లో ద్వంద్వార్థపు మాటలని ఖండించడం దగ్గరి నుంచి ఆ షో విడిచి పెట్టడం వరకు నా లోని ఆ మార్పు మీరు గమనించవచ్చు. ఈరోజు మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పటి ఆ మాటలు తీసి హేట్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలను. ఆ కార్యక్రమం దర్శక రచయిత నిర్మాతలు మీకు క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యతగా నా తప్పును అంగీకరిస్తూ మీకు క్షమాపణ చెబుతున్నా.." అంటూ అనసూయ ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఈ విషయాన్ని అర్థం చేసుకుని తనకు మద్దతుగా ఉంటారని ఆశిస్తూ ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.
-
"మొన్న చెప్పి హిట్టు కొట్టా.. మళ్లీ చెప్తున్నా బంపర్ బ్లాక్ బస్టర్" -
'బైకర్' ట్రైలర్ రిలీజ్.. శర్వానంద్ ఈసారి హిట్ కొట్టేశాడోచ్..! -
తెలంగాణ గద్దర్ అవార్డుల్లో చిన్న సినిమా హవా! -
మీకు అర్థమవుతోందా?.. ‘ధురంధర్2’ తీయడం వెనక పక్కా రాజకీయ వ్యూహం -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే? -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో -
ఓటీటీని షేక్ చేస్తున్న చిన్న సినిమా.. హీరో కూడా లేడు !! -
థియేటర్ల దగ్గర తొలిసారిగా 144 సెక్షన్, భారీగా పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు ఈ హీరో సినిమాకే -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications