కొంచెం ముందు వచ్చి ఉంటే..ఇండస్ట్రీని ఊపేసే దానివి..!
యాంకర్ అనసూయ కేవలం టీవీ యాంకర్ గానే కాకుండా, తన గ్లామర్, అద్భుతమైన డ్రెస్సింగ్ సెన్స్‌తో బుల్లితెరపై ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. 'జబర్దస్త్' షో ద్వారా ఆమె అపారమైన క్రేజ్ సంపాదించారు. ఆ క్రేజ్‌తో సినిమా అవకాశాలు కూడా ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ఆమె నటనలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. **'రంగస్థలం'**లో రంగమ్మత్త పాత్రతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న అనసూయ, 'క్షణం', 'పుష్ప', 'యాత్ర' వంటి సినిమాలతో ఒక నటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.
న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ, ఆ తర్వాత యాంకర్, నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు విభిన్న పాత్రల్లో మెప్పిస్తున్నారు. కొందరు దర్శకులు ఆమె కోసమే కథలు రాస్తున్నారంటే ఆమెకున్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. అందం, అభినయం రెండూ ఉన్న అనసూయకు వివాదాలు కూడా కొత్తేం కాదు. బహిరంగంగానే ముద్దులు, హగ్గులు, బికినీలతో ట్రోలింగ్ బారిన పడుతుంటారు.

అలాగే, హీరో విజయ్ దేవరకొండతో జరిగిన వివాదం కూడా అందరికీ తెలిసిందే. తనను విమర్శించే వారికి ధీటుగా కౌంటర్ ఇవ్వడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. 39 ఏళ్ల వయసులో కూడా తన ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తూ, గ్లామర్‌తో యువ హీరోయిన్లకు పోటీనిస్తున్నారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే అనసూయ తాజాగా రాణి కలర్ చీర, ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్‌తో దిగిన ఫొటోలను షేర్ చేసి అభిమానులను అలరించారు.వయ్యారాలన్నీ ఒలకబోస్తూ అనసూయ కుర్రాళ్లకు కనువిందు చేసింది.
పరువాలను ప్రదర్శిస్తూ మైమరిపించింది. అటు ట్రెడిషనల్‌గా కనిపిస్తూనే మోడ్రన్ లుక్‌లో ఈ హాట్ బ్యూటీ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. రోజు రోజుకు అందాల డోస్ రెట్టింపు చేస్తూ హీరోయిన్స్‌కే అసూయ పుట్టేలా అందాలన్నీ ప్రదర్శిస్తోంది. నవ్వులు చిందిస్తూ అభిమానులకు వినోదం పంచింది. ఈ ఫొటోలపై నెటిజన్లు తమదైనశైలిలో రియాక్ట్ అవుతున్నారు. చీర కట్టిన, స్కర్ట్ వేసిన అనసూయకే చెల్లిందని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, కొంచెం ముందు వచ్చి ఉంటే ఇండస్ట్రీని ఊపేసేదానివి అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం అనసూయ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications