ఆ స్టార్ హీరో పక్కలోకి రమ్మన్నారు, దర్శకుడు కూడా ..అనసూయ సంచలన కామెంట్స్

ప్రతీ ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్‌, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు.

తాజాగా స్టార్ యాంకర్, నటి అనసూయ సైతం తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి వెల్లడించింది. నిఖిల్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అనసూయ పలు అంశాలపై స్పందించింది. ఈ సందర్భంగా తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి అనసూయ ప్రస్తావించింది. సినిమాల్లో అవకాశాల పేరుతో వాడుకునేందకు హీరోలు, దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తూనే ఉంటారని అనసూయ సంచలన కామెంట్స్ చేశారు.

anasuya comments on casting couch in industry

ఓ స్టార్ హీరో తనని ఇలాగే కమింట్మెంట్‌ అడిగారని, ఆయనకు తాను నో చెప్పానని, ఓ స్టార్ దర్శకుడు సైతం ఇలాగే అవకాశం ఇస్తానని చెప్పడంతో రిజెక్ట్ చేశానని అనసూయ తెలిపింది. దీంతో నాకు సినిమా అవకాశాలు తగ్గాయని అనసూయ వెల్లడించింది. ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని, అలాంటి వాటికి నో చెప్పే ధైర్యంగా ఉండాలని అనసూయ చెప్పుకొచ్చింది. అయితే అ హీరో, డైరెక్టర్ ఎవరనేది మాత్రం అనసూయ బయటపెట్టలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+