చేతిలో గ్లాసు రోడ్డు మీద డ్యాన్స్..చీల్ మూడ్‌లో అనసూయ
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుతున్నారనే విషయం అందరికి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈజీగా రీచ్ కావొచ్చనే అభిప్రాయం చాలామంది సెలబ్రిటీల్లో నెలకొంది. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారిలో యాంకర్ అనసూయ కూడా ఒకరు.
న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ తర్వాత యాంకర్‌గా , హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది. అనుసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టింది. ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే..అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందం , అభినయం రెండు ఉన్న అనసూయకు వివాదాలు కూడా కొత్తేం కాదు. బహిరంగంగానే ముద్దులు, హగ్గులు, బికినీలతో రచ్చ చేస్తూ..ట్రోలింగ్ బారిన పడుతున్నారామె. ఇక హీరో విజయ్ దేవరకొండతో వివాదం గురించి అందరికి తెలిసిందే.

తనని విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా సమాధానం కౌంటరిస్తుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ. అనసూయ ఏం చేసిన కూడా సంచలనమే అన్నట్టుగా ఉంటోంది. 38 ఏళ్ల వయస్సులో కూడా సూపర్ హాట్‌గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది. గ్లామర్‌గా కనిపించడానికి అనసూయ తెగ కష్టపడుతుంటుంది. ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. ఇక సోషల్ మీడియాలో అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
తాజాగా అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఓ బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫొటోలను అనసూయ పోస్ట్ చేయడం జరిగింది. ఈ ఫొటోల్లో అనసూయ ఫుల్ పార్టీ మూడ్‌లో కనిపించింది. ఓ వీడియోలో చేతిలో గ్లాస్, అందులో డ్రింక్ తాగుతూ దర్శనం ఇచ్చింది. ఆ పార్టీలో అనసూయతో పాటు ఆమె భర్తలు పిల్లలు కూడా ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ఇక మరో వీడియోలో కొడుకు కలిసి రోడ్డు మీద డ్యాన్స్ వేస్తూ కనిపించింది. అర్థరాత్రి కావడంతో అనసూయ ఎటువంటి బేరుకు లేకుండా కొడుకుతో కలిసి చిందులు వేసింది. ప్రస్తుతం అనసూయ పోస్ట్ చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications