అనసూయా.. ఇలాంటి చీరలు ఇంకెప్పుడూ కట్టొద్దు?
జబర్దస్త్ షో వేదికగా యాంకర్ అనసూయ ఎన్ని సంచనాలు చేసిందో మనందరం చూశాం. అక్కడే ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. తర్వాత సినిమాల్లో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంది. వరుస సినిమాలతో బిజీగా మారిన అనసూయ యాంకరింగ్ మానేసింది. పూర్తిగా సినిమాలపైనే దృష్టి కేంద్రీకరించింది. తెలుగు, తమిళం, మళయాళంతోపాటు పలు భాషల సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది.
అనసూయకు 38 సంవత్సరాల వయసు అంటే ఎవరూ నమ్మరు. ఎందుకంటే అంత ఫిట్ నెస్ గా ఉంటుంది. గ్లామర్ అలా ఇలా ఉండదు. హీరోయిన్లతో పోటీపడుతుంటుంది. కుర్రాళ్లు మాత్రం అనసూయకే ఓటేస్తారు. సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హాట్ హాట్ గా తాను చేసే ఫొటో షూట్స్ చూస్తే మాత్రం పిచ్చెక్కడం ఖాయం. తనకు సమయం దొరికినప్పుడల్లా భర్త, పిల్లలతో కలిసి సరదాగా యాత్రలకు వెళుతుంటుంది. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చిన అనసూయను చూస్తే మతిపోవడం ఖాయం. తన నిండైనా అందాల విందు లాంటి సోయగాల ప్రదర్శనతో అభిమానులను మెస్మరైజ్ చేసింది. ఈ ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఎంతో అందంగా ఉన్నారంటూ కొనియాడుతున్నారు. రజాకార్ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా ఇలా చీర కట్టుకొని కార్యక్రమానికి హాజరైంది. తనకు బదులిచ్చిన అభిమానులకు రజాకార్ ట్రైలర్ చూశారా? అంటూ పోస్ట్ చేసింది. సాంప్రదాయంగా ఉండే చీరకట్టులో అనసూయ అందరి మనసులను అలా అలా దోచేస్తోంది. సోషల్ మీడియాలో అనసూయ ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమెకు 1.4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం రజాకార్ సినిమా చేస్తున్న అనసూయ పుష్ప2లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.












Click it and Unblock the Notifications