పవన్ కాలిగోటికి కూడా సరిపోవు..అనసూయపై ఫ్యాన్స్ ఫైర్

అనసూయ పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోతున్న సంగతి తెలిసిందే. రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనుసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేంతో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

రంగస్థలం సినిమా తరువాత అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే.. ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.

Anasuya rejected Pawan s film

ఈ హ్యాట్ బ్యూటీ 38 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అనసూయ ఇచ్చే గ్లామర్ ట్రీట్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. చీర కట్టిన ,స్కర్ట్ వేసిన, బికినితో దర్శనం ఇచ్చిన అది అనసూయకే చెల్లింది. అందానికి కేరాఫ్ అడ్రస్ ఆమె.. వయసు పెరుగుతున్న తరగని అందంతో కవ్విస్తుంది అనసూయ.

ఇదిలా ఉంటే గతంలో పవన్ కల్యాణ్ సినిమాలో నటించే అవకాశాం వచ్చినప్పటికి ఆమె రిజెక్ట్ చేశానని అనసూయనే స్వయంగా ఓ ఇంటర్య్వూలో వెల్లడించింది. పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ వస్తే అనసూయ వదులుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తరింటికి దారేది సినిమాలో "ఇట్స్ టైం టూ పార్టీ నౌ" అనే సాంగ్ కోసం ముందుగా అనసూయను సంప్రదించారట.

అయితే అందులో చాలా మంది హీరోయిన్స్ కూడా కనిపిస్తారు అని చెప్తే దానికి అనసూయ నో చెప్పారట. నేను ఒక్కదాన్నే చేస్తాను.. అంతమందితో కలిసి అంటే నేను చేయను అని చెప్పిందట. నేను సోలోగా ఉంటేనే చేస్తా అని చెప్పిందట. అనసూయ నో చెప్పడంతో ఆమె స్థానంలో మరొకర్ని తీసుకోవడం జరిగింది. పవన్ సినిమాను రిజెక్ట్ చేయడంతో ఆమెను అభిమానులు దారుణంగా ట్రోల్ చేశారు. పవన్ కళ్యాణ్ పక్కన ఛాన్స్ వస్తే నో చెప్తావా అంటూ ట్రోల్ చేశారు. నువ్వు పవన్ కళ్యాణ్ కాలి గోటికి కూడా సరిపోవు అంటూ కామెంట్స్ చేశారు. అయితే తాను అంత దూరం ఆలోచించలేదంటూ అనసూయ చెప్పుకొచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+