స్టార్ యాంకర్‌పై అత్యచారం..నిద్ర మాత్రలు ఇచ్చి మరీ..

ఇటీవల కాలంలో సినీ నటులు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడుగా నటించిన జగదీష్ ఓ యువతిని వేధించారనే కేసులో అరెస్ట్ అయ్యాడు. సదరు యువతి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించడంతో.. ఇష్యూ పెద్దదిగా మారింది. జగదీష్ అరెస్ట్ ప్రభావం పుష్ప-2 సినిమా షూటింగ్ మీద పడింది. ఇక తెలుగు ప్రముఖ యూట్యూబర్ చందు సాయిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. చందు సాయి తనని ప్రేమించి మోసం చేశాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చందు సాయి తనపై అత్యాచారం చేశాడని ఆ యువతి ఫిర్యాదులొ పేర్కొంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.చందు సాయితో పాటు ఆతని తల్లిదండ్రుల మీద కేసు నమోదైంది. తాజాగా ఓ స్టార్ యాంకర్ అత్యచారానికి గురైందనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘాతుకానికి పాల్పడింది ఓ పూజారి కావడం విశేషం. ఆ వివరాల్లోకి వెళ్తే..

anchor accuse temple priest of raping

చెన్నైలోని సాలిగ్రామం ప్రాంతంలో టీవీ యాంకర్‌గా ఓ యువతి పని చేస్తోంది. అయితే ఆమెకు ఆలయాలకు వెళ్లే అలవాటు ఉండటంతో, ప్రతి రోజూ చెన్నైలోని పర్యాస్ ప్రాంతంలోని కాళికంపాల్ ఆలయానికి వెళ్తుండేది. దీన్ని గమనించిన అక్కడ ఆలయ పూజారి ఆమెపై కన్నేశాడు. సందర్భం లేకపోయిన మాట్లాడుతూ ఆమెతో పరిచియాన్ని పెంచుకున్నాడు. ఆ యాంకర్‌కు దగ్గర కావడానికి స్పెషల్‌గా పూజలు జరిపించేవారు. ఆమె పూర్తి తనని నమ్మిన తర్వాత ఓ రోజు కారులో నేను డ్రాప్ చేస్తానంటూ తీసుకువెళ్లి తీర్థంలో నిద్ర మాత్రలు ఇచ్చి మరీ అత్యాచారం చేశాడు.

జరిగిన విషయాన్ని తెలుకున్న ఆ యాంకర్ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో సరే అని చెప్పి ఇంటికి తీసుకువెళ్లాడు. ఆ తర్వాత కూడా వీరి మధ్య సాన్నిహిత్యం కొనసాగింది.ఈ క్రమంలోనే ఆమెకు ప్రెగ్నెంట్ అవుతే అబార్షన్ చేయించాడని, తనను బలవంతంగా వ్యభిచారంలోకి దిగమని బలవంతం చేస్తున్నట్లు యాంకర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలిసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.చెన్నైలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం అందరినీ షాక్‌కు గురిచేస్తుంది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+