జనసేనకు షాకిచ్చిన యాంకర్ అనసూయ

యాంకర్ అనసూయ పొలిటికల్ ఎంట్రీ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అనసూయ ఓ రాజకీయ పార్టీలో చేరడానికి రెడీ అవుతుదంటూ ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అనసూయ ఇటీవల మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ కోరితే వచ్చే ఎన్నికల్లో జనసేన తరుఫున ప్రచారం నిర్వహిస్తానని ప్రకటించారు. దీంతో ఆమె జనసేనలో చేరడానికి రెడీ అయిందంటూ వార్తలు వెలిశాయి.

ఈ పుకార్లు అక్కడితో ఆగకుండా ..అనసూయ జనసేనతో పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందని..వచ్చే ఎన్నికల్లొ ఆమె ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తుందనే రూమర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనపై పుకార్లు ఎక్కువ కావడంతో తాజాగా అనసూయ దీనిపై వివరణ ఇచ్చారు. తాను ఏం చేసిన అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. తుమ్మిన, దగ్గిన అది కాంట్రవర్సీకి దారి తీస్తోందని అనసూయ ఆవేదన వ్యక్తం చేసింది.

Anchor anasuya clarity on her political entry and election campaign

ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రాజకీయాలపై అక్కడి రిపోర్టులు అడిగిన ప్రశ్నలకు మాత్రమే నేను సమాధానం ఇచ్చానని అనసూయ తెలిపింది. నాయకుడు నచ్చి..ఆ పార్టీ ఏజెండా నచ్చితే వారికి తప్పకుండా సపోర్టు చేస్తానని చెప్పాను. పవన్ కల్యాణ్ అంటే నాకు ఇష్టం. జనసేన పార్టీ అజెండా నాకెంతో నచ్చింది. అంతే కానీ ఆ పార్టీలో చేరతానని, ప్రచారాలకు వెళ్తానని తాను ఎప్పుడు చెప్పలేదని వివరణ ఇచ్చింది.

దీంతో తాను జనసేనలో చేరడం లేదని, ఆ పార్టీ తరుఫున ప్రచారం కూడా చేయడం లేదని అనసూయ క్లారిటీ ఇచ్చింది. అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న పుష్ప-2లో అనసూయ విలన్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో ఆమె నటిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+