వైసీపీ - జనసేన... మధ్యలో అనసూయ

ఏదైనా కార్యక్రమానికి సినీ తారలు వస్తున్నారంటే వారిని చూడాలని, వారితో ఫొటోలు దిగాలని, దగ్గర నుంచి వారిని తనివితీరా చూడాలనే ఆశతో ఎంతోమంది అభిమానులు వేలసంఖ్యలో గుడికూడతారు. వారిని దాటుకొని బయటకు రావాలన్నా, లోపలికి పోవాలన్నా తారలకు బౌన్సర్లు అవసరమవుతారు. అంతటి ఒత్తిడి నెలకొంటుంది. కార్యక్రమానికి పవన్ కల్యాణ్ లాంటి క్రేజీ స్టార్లు వస్తే అక్కడ పరిస్థితి ఇసుకేస్త రాలనంతగా మారిపోతుంది.

తాజాగా కృష్ణా జిల్లా పోరంకిలో పవర్‌స్టార్‌ అభిమానులు చేసిన సందడి గురించి అందరికీ తెలిసిందే. వంగవీటి రాధా వివాహానికి హాజరైన పవన్‌ కల్యాణ్‌ను చూసేందుకు జనం ఎగబడటంతో వారిని నియంత్రించడం ఎవరివల్లా కాలేదు. ఆ తోపులాటలో మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా చిక్కుకుపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

anchor anasuya entered between janasena and ysrcp

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోను షేర్ చేస్తూ పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ట్రెండింగ్ లో నిలిచేలా చూస్తున్నారు. వైసీపీకి, జనసేనకు ఈ విషయమై యుద్ధం నడుస్తోంది. వైఎస్ జగన్ వచ్చినా ప్రజలు ఇదేస్థాయిలో ఎగబడతారని, తాము ఎందులోను తీసిపోలేదంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు. మరొక నెటిజన్ 'అనసూయ, రష్మీ ఇక్కడికి వచ్చినా జనం ఇలాగే ఎగబడతారు' అంటూ చేసిన ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం అది వైరల్ గా మారింది. అయితే ఇలా వ్యాఖ్యానించడాన్ని అనసూయ తప్పుబట్టింది.

ఆ వేడుకలో తమ పేర్లు ప్రస్తావించడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ''ఎంతో శ్రమించి ఈ స్థాయికి వచ్చానని, తన ప్రయాణాన్ని తక్కువ చేసి చూడకుండా గౌరవిస్తే బాగుంటుందని పేర్కొంది. ఈ విషయంలో తమ పేర్లు ఉపయోగించడం తప్పు అని, జీవితంలో ఏదో సాధించిన వారు ఎలా ఉంటారో చూద్దామనే ఉత్సాహంతో జనం వస్తారని, తమరి పేర్లు వాడినంత మాత్రాన ఎవరూ సులువుగా ఈ స్థాయికి రాలేరని, ఈ విషయాన్ని అందరూ గుర్తిస్తే మంచిదని'' సూచించింది. ది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+