న్యూ ఇయర్ స్పెషల్ పోస్ట్.. అనసూయ పిక్స్ వైరల్ !!

అనసూయ భరద్వాజ్‌.. న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత యాంకర్‌గా మారింది. ఈటీవీ షో 'జబర్దస్త్‌' ద్వారా బాగా ఫేమస్ అయ్యి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ క్రేజ్ ద్వారానే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. క్షణం, రంగస్థలం, పుష్ప చిత్రాల్లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. వయస్సుతో సంబంధం లేకుండా గ్లామర్ తో ఫాలోయింగ్ పెంచుకుంటుంది.
ప్రస్తుతం వరుస సినిమాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో నటిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతుంది.

అందం, అభినయంతో పాటే అనసూయకు వివాదాలు కూడా అలవాటు అని చెప్పాలి. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ పలు అంశాలపై రియాక్ట్ అవుతూ ఉంటారు. అయితే తన గ్లామర్ ఫోటోలను, బికినీతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ట్రోలింగ్ బారిన పడుతూ ఉంటారు. కానీ తనని విమర్శించిన వారికి కూడా అదే రీతిలో ధీటుగా కౌంటరిస్తుంటుంది ఈ బ్యూటీ.

anchor-anasuya-latest-instagram-post-goes-viral-on-social-media

ఇక ఇటీవల "దండోరా" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వేదికగా నటుడు శివాజీ హీరోయిన్ల డ్రస్సింగ్, బాడీ పార్ట్స్‌పై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెద్ద దుమారాన్నే రేపాయి. ఆ కామెంట్స్ పై సింగర్ చిన్మయి శ్రీపాద, అనసూయ రియాక్ట్ అవ్వడం.. మహిళా కమిషన్ సైతం స్పందించడంతో ఈ వ్యవహారం సినీ వర్గాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో సైతం చర్చనీయాంశంగా మారింది. విమర్శలు పెరగడంతో శివాజీ క్షమాపణ చెప్పినా కూడా వివాదం మాత్రం సర్దుమనగడం లేదు.

ఈ విషయంలో తనదైన శైలిలో రియాక్ట్ అవుతూ "ఇది మా బాడీ... మా ఇష్టం" అనే భావనతో పోస్ట్ పెట్టారు. అప్పటి నుంచి ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించగా.. శివాజీకి మద్దతుగా నిలుస్తున్న కొందరు నెటిజన్లు అనసూయనే టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగారు. ముందు మీరు వేసుకునే దుస్తుల విషయంలో జాగ్రత్త వహించాలని కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈ తరుణంలోనే నూతన సంవత్సరం సందర్భంగా ఎన్ని విమర్శలు వచ్చినా ఏమాత్రం వెనక్కి తగ్గనని నిరూపించారు.

బికినీ పిక్స్ వైరల్..

కాగా అనసూయ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా.. తన భర్తతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. బికినీలో ఉన్న ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. ఆ పోస్ట్ పట్ల పలువురు పలు రకాలుగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఆ కామెంట్స్ కి కూడా అనసూయ ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+