anasuya: ప్లీజ్.. అలా చూడొద్దు అనసూయా.. నీకు న్యాయం కాదు!
యాంకర్ అనసూయ అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడే లేడు. అంతలా హీరోయిన్లకు మించిన పాపులారిటీని సంపాదించుకోవడమేకాదు అందరినీ తనదైన శైలిలో ఆకట్టుకుంది. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా పనికిరారని చెప్పొచ్చు. ఈటీవీ జబర్దస్త్ ద్వారా యాంకర్ గా మంచి పాపులారిటీ దక్కింది. తనతోనో అందమైన గ్లామర్ యాంకరింగ్ ను టీవీ పరిశ్రమకు అలవాటు చేసింది. జబర్దస్త్ కు గుడ్ బై చెప్పి సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది. అక్కడ కూడా ఈ ముద్దుగుమ్మ బాగా రాణిస్తోంది.
మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసింది. తర్వాత సపోర్టింగ్ రోల్స్ లో నటించింది. రామ్ చరణ్-సుకుమార్ సినిమా రంగస్థలం లో రంగమ్మత్త పాత్ర ఆమెకు టర్నింగ్ పాయింట్ అయింది. తర్వాత పుష్ప లాంటి భారీ బడ్జెట్ సినిమాలో అవకాశం కొట్టేసింది. ఇటీవలే విమానం సినిమా చేసింది. ఆ సినిమాలో అనసూయదే ముఖ్యమైన పాత్ర. అది కూడా మంచిపేరు తెచ్చిపెట్టింది. మొదటి నుంచి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. తన వ్యక్తిగతానికి సంబంధించి, వృత్తికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్ వార్తలు ఇవ్వడంతోపాటు గ్లామర్ ఫొటోలను కూడా పోస్ట్ చేస్తుంటుంది.

తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాల్లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో అనసూయ ఎంతో అందంగా కనిపించడమేకాదు.. కుర్రాళ్లను పిచ్చెక్కించేలా ఉంది. కొందరు అభిమానులు చాలా బాగున్నావంటూ కామెంట్లు పెడుతుండగా మరికొందరు అభిమానులు మాత్రం నాటు పదాలను వాడుతున్నారు.

అయితే ఒక నెటిజన్ చేసిన కామెంట్ మాత్రం వైరల్ గా మారింది. రాజుల కాలం కాదు కాబట్టి అనసూయ బతికిపోయిందని, లేదంటే ఎవరో ఒక రాజు వచ్చి తన గుర్రంపై అనసూయను ఎత్తుకెళ్లిపోయేవాడంటూ కామెంట్ చేశాడు.












Click it and Unblock the Notifications