తల్లి కాబోతోన్న యాంకర్ అనసూయ?
యాంకరింగ్ కు గ్లామర్ అద్దిన అనసూయ ప్రస్తుతం సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉంటోంది. ఇటీవలే విమానం అనే సినిమాలో నటించిన అనూ పాత్రల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఓ పక్క గ్లామర్ షో చేస్తూనే మరోపక్క ఇంటిమేట్ సన్నివేశాల్లో అద్భుతంగా రాణిస్తోందని చెప్పొచ్చు. ప్రస్తుతం పుష్ప2 చేస్తోంది. మరిన్ని పాత్రలను ఎంపిక చేసుకునే క్రమంలో కథలు వింటోంది.
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ క్రేజ్, పబ్లిసిటీ, ప్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఈ స్థాయికి రావడానికి ఆమె ఎంతో కష్టించిందని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే అనసూయ తరుచుగా ట్రోలింగ్ ను ఎదుర్కొంటోంది. అయితే వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ చాకచక్యంగా వ్యవహరిస్తుంటుంది. ట్రోలింగ్ చేసినవారికి ఘాటుగా సమాధానం చెబుతుంది. తనకు పాత్ర నచ్చితే ఎంత రిస్క్ చేయడానికైనా సిద్ధపడుతుంది. ఈ తరహా వైఖరి అందరికీ నచ్చుతోంది.

ఓ స్టార్ హీరోకు తల్లిగా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ హీరో చిన్నప్పటి పాత్రకు మాత్రమే తల్లిగా నటించబోతోంది. అయితే ఈ క్యారెక్టర్ ప్రేక్షకులకు ఎంతో నచ్చుతుందంటున్నారు. తల్లి సెంటిమెంట్ ను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ పాత్ర చేసినందుకు ఆమెను ట్రోల్ చేస్తారని తెలుసు. అయినా ఈ పాత్ర చేయడానికి అనసూయ ఒప్పుకుంది. ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియదుకానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారింది. ఈ నిర్ణయాన్ని కొందరు పొగుడుతున్నారు. మరికొందరు మాత్రం ఈ వయసులో తల్లి కాబోతున్నావా? అంటూ వెటకారంగా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇలా కామెంట్లు పెట్టేవారికి తొందరలోనే ఇచ్చిపడేస్తుందని ఆమె అభిమానులు అంటున్నారు.












Click it and Unblock the Notifications