నిజమైన ప్రేమ అయితే నా జీవితంలోకి మళ్లీ వస్తావ్.. రష్మి ఎమోషనల్ పోస్ట్

బుల్లితెర యాంకర్ రష్మి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన రష్మి.. సినిమాల్లో సరైన అవకాశాలు దొరక్కపోవడంతో బుల్లితెర మీద యాంకర్ అవతారం ఎత్తింది. జబర్థస్త్ షోలో యాంకర్‌గా కనిపించిన తర్వాత రష్మి జాతకమే మారిపోయింది. జబర్థస్త్ షో రష్మికి ఫుల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా రష్మి -సుడిగాలి సుధీర్‌ల మధ్య కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. టీవీ రంగంలో రష్మి -సుడిగాలి సుధీర్‌లపెయిర్ సంచలనం సృష్టించారని అని చెప్పాలి.

వీరిద్దరూ కలిసి కనిపిస్తే చాలు ఆ షో సూపర్ హిట్ అనే రేంజ్‌కి వెళ్లిపోయిందంటే వీరి క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో రష్మి పలు సినిమాల్లో హీరోయిన్‌గా కూడా అవకాశాలు దక్కించుకుంది. ఇదిలా ఉంటే రష్మి జంతు ప్రేమికురాలనే విషయం అందరికి తెలిసిందే. కరోనా సమయంలో కూడా ఆమె రోడ్డు మీద ఉన్న జంతువులకు ఆహారం అందించి తన ఉదారతను చాటుకుంది.

anchor Rashmi emotional post goes viral

జంతువులను ఎవరైనా హింసిస్తే అదే రీతిలో ఫైర్ అయ్యేదామె. ఆ మధ్య ఓ పెంపుడు కుక్క ఐదు నెలల చిన్నారిపై దాడి చేసింది. ఈ ఘటనలో ఆ చిన్నారి మరణించింది.దీంతో ఆ చిన్నారి పేరెంట్స్ దాడి చేసిన కుక్కను వెంటనే కొట్టి చంపేశారు. ఈ ఘటనపై రష్మి స్పందించారు. ఆ కుక్కను చంపినందుకు చిన్నారి తల్లిదండ్రుల మీద కేసు పెట్టాలని రష్మీ గౌతమ్ డిమాండ్ చేశారు. ఇలా జంతువుల్ని ఎవరైనా హింసిస్తే ఆమె ఊరుకోరు.

ఇదిలా ఉంటే ఇటీవలే రష్మి ప్రేమగా పెంచుకుంటున్న కుక్క మరణించింది. రష్మి తన పెట్ అస్తికలను గోదావరి నదిలో కలిపింది. దీనిపై రష్మి తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసింది. . ''నిన్ను ప్రేమించే అవకాశం కోసం జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటాను. పునర్జన్మ ఉంటే నువ్వు బాధ లేకుండా పుడతావని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. నన్ను క్షమించు. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఫ్రీగా వెళ్ళు చుట్కీ గౌతమ్'' అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం రష్మి షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+