నా ప్రేమ నిజమైతే నువ్వు మళ్లీ వస్తావు: రష్మి
జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న రష్మి బుల్లితెరపై సూపర్ స్టార్ యాంకర్ హోదా అనుభవిస్తోంది. జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన ప్రాచుర్యాన్ని పొందిన రష్మి సినిమాల్లో కూడా నటించినప్పటికీ బుల్లితెరకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ప్రధానంగా సుడిగాలి సుధీర్ తో రష్మి కెమిస్ట్రీ చూసినవారంతా ఫిదా అయ్యేవారు. అంతగా ఆ జంట ఆకట్టుకుంది. వాస్తవానికి వీరిద్దరూ వివాహం చేసుకుంటారని అందరూ భావించారుకానీ అటువంటిదేమీ లేదని, తామిద్దరం కేవలం మంచి స్నేహితులమేనని ఇద్దరూ చెప్పారు. అయినప్పటికీ అభిమానులు మాత్రం వారిద్దరూ కచ్చితంగా పెళ్లిచేసుకుంటారని భావిస్తున్నారు.
అస్తికలను గోదావరిలో కలిపిన రష్మి
రష్మి చాలా బిజీగా ఉన్నప్పటికీ తనకు సంబంధించిన అన్ని వార్తలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ఇటీవలే రష్మి పెంచుకుంటున్న పెంపుడు కుక్క మరణించింది. దాని అస్తికలను గోదావరిలో కలిపింది. ఈ సందర్భంగా భావోద్వేగాలతో కూడిన పోస్ట్ ను షేర్ చేసింది. జీవితకాలం నిన్ను మిస్ అవుతున్నానని, లేదంటే జీవితకాలం నిన్ను ప్రేమించే అవకాశం ఉండేదంది. పునర్జన్మ ఉంటే నువ్వు ఎటువంటి బాధ అనుభవించకుండా జన్మిస్తావంటూ రాసుకొచ్చింది. తనను క్షమించాలని, కొన్ని కఠిన నిర్ణయాలు జీవితంలో తీసుకోవాల్సి వచ్చిందని, ఫ్రీగా వెళ్లు చుట్కీ గౌతమ్ అని పేర్కొంది.

తిరిగి బుల్లితెరపైకి వచ్చిన సుడిగాలి
సుడిగాలి సుధీర్ కొంతకాలం జబర్దస్త్ మానేసి సినిమాల్లో హీరోగా నటించాడు. కొన్ని హిట్ అవగా, మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. తిరిగి అతను కూడా బుల్లితెరపైకి వచ్చేశాడు. ప్రస్తుతం జబర్దస్త్ లో నటించకపోయినప్పటికీ ఈటీవీ నిర్వహించే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. అలాగే ఇతర ఛానల్స్ లో కూడా యాంకరింగ్ చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ కానీ, రష్మి కానీ ఇంతవరకు వివాహం చేసుకోలేదు. అభిమానులు మాత్రం వీరిద్దరూ ఎప్పటికైనా వివాహం చేసుకుంటారంటూ ఎదురుచూస్తున్నారు. అయితే అది జరుగుతుందా? లేదా? అనేది కాలమే నిర్ణయించాలంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications