అతనే తన భర్తగా రావాలని కోరుకున్న రష్మి

రష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షోద్వారా స్టార్ యాంకర్ గా మారింది. తర్వాత హీరోయిన్ స్థాయికి ఎదిగింది కానీ టీవీల్లో యాంకరింగ్ కార్యక్రమాలకే ప్రాధాన్యతనిస్తుంటుంది. ఈటీవీలో వచ్చే జబర్దస్త్ కార్యక్రమంద్వారా సుడిగాలి సుధీర్, రష్మి జంట బాగా పాపులర్ అయ్యారు. సుధీర్ ప్రస్తుతం సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. అప్పుడప్పుడు కొన్ని టీవీ కార్యక్రమాలకు అతిథిగా వచ్చి మెరుస్తున్నాడు. బుల్లితెరపై తిరుగులేని జంటగా పేరు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ - రష్మి జంట నిజ జీవితంలో కూడా పెళ్లి చేసుకుంటారని చాలామంది భావించారుకానీ అదంతా కేవలం తెరపై మాత్రమేనని, అటువంటిదేమీ లేదని, కేవలం తమ మధ్య ఉన్నది స్నేహమేనని ఇద్దరూ చెప్పేశారు.

నీళ్లల్లో దీపాలు వదులుతారు
ఈటీవీలో జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా బాగా పాపులర్ అయింది. దీనికి మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తుంటాయి. జబర్దస్త్ లో నటించే కమెడియన్లే ఈ షోను కూడా నడిపిస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. రాబోయేది కార్తీక పౌర్ణమి కావడంతో ఆ సందర్భానికి తగ్గట్లుగా కార్యక్రమం తీసినట్లు అర్థమవుతోంది. కార్యక్రమంలో భాగంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో పాల్గొనే లేడీ కంటెస్టెంట్స్ నీటిలో దీపాలను వదులుతారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పెళ్లికాని అమ్మాయిలు మంచి మొగుడు రావాలని కోరుకుంటూ నీళ్లల్లో దీపాలను వదలడం సాంప్రదాయం.

Anchor Rashmi wanted him to be her husband by releasing lamps in the water on the occasion of Kartika pournami

ఎవరిని కోరుకున్నావో చెప్పాలని అడిగిన రాంప్రసాద్
రష్మీ దీపాలను నీళ్లల్లో వదులుతూ తాను మనసులో ఎవరినైతే కోరుకుంటున్నానో అతనే తన భర్తగా రావాలని కోరుకుంటున్నట్లుగా భగవంతుడితో చెబుతుంది. తర్వాత రాంప్రసాద్ ఎవరిని కోరుకున్నావ్ రష్మీ? ఎవరతను? చెప్పమని కోరతాడు. అయితే పేరు చెప్పడానికి రష్మి సిగ్గుపడుతుంది. కనీసం పోలికలన్నీ చెబితే ఎవరో తమకు అర్థమవుతుందని నూకరాజు అంటాడు. తనకు కాబోయే భర్త గుర్రంమీద యువరాజులా వస్తాడని రష్మి చెప్పగా... అది గుర్రం కాదు మేక ఏమో చూడండి అంటూ ఇంద్రజ సెటైర్లు వేస్తుంది. ఇలా సరదా సరదాగా ప్రోమో ఉంది. అయితే రష్మి పెళ్లిచేసుకోబయేది ఎవరిని? ఆ అదృష్టవంతులు ఎవరు? అనేది తెలుసుకోవాలంటే వచ్చేవారం వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ చూడాల్సిందే. అయితే నెటిజిన్లు మాత్రం రష్మీ కోరుకుంది సుధీర్ అన్ననే అని, ఆమె మనసులో సుధీర్ మాత్రమే ఉన్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+